లేఖ ఇచ్చి 11 నెలలైంది, రఘురాముడి మీద వేటేయరా?:వైసిపి అసహనం

రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడం మీద లోక్ సభ స్పీకర్ చేస్తున్న జాప్యం పట్ల వైసిసి అసహనం వ్యక్తం చేసింది.

పార్టీ నర్సాపురం  ఎంపి రెబెల్ గా మారాక, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ  ఎంపిలు 11 నెల కిందట స్పీకర్ ఓమ్ బిర్లాకు లేఖ ఇచ్చారు. ఇంతవరకు  రఘురామ మీద చర్య తీసుకోలేదు. దీనితో రెబెల్ ఎంపిని లోక్ సభలో లేకుండా చేయాలన్న జగన్ కోరిక నెరవేరవడం లేదు.

ఎంపిగా ఉన్న ప్రివిలేజెస్ ను ఉపయోగించుకుని రఘురామ జగన్ మీద ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. జగన్ జైలుకు పంపుతానని   చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ కి పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లో బిజెపి నేతలకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికపుడు వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మీద తొందరగా పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు  వేయాలని  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లా కు  లేఖ రాశారు.

అనర్హుడయిన వ్యక్తిని ఎంపిగా కొనసాగిస్తున్నందున, అర్హుడయిన వ్యక్తిని ఎంపిగా ఎన్నుకునే అకాశం నర్సాపురం ప్రజలు కోల్పోతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

“It is very unfortunate that we have to bring up this issue of action on our disqualification petition several times when the office of the Speaker of the Lok Sabha is considered to be a model of other government officials in terms of compliance with rules and efficiency. The inordinate delay in acting on the disqualification petition is causing injustice to the people of Narsapuram, Andhra Pradesh as they are being represented by a person who is ineligible. Shri Raghu Rmakrishan Raju’s constituents deserve to be represented by someone who is legally to be their Member of Parliament.”

పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అన్యాయమని అది తగదని ఆయన పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించిన విషయాలు:

*అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచింది .ఈ పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు మిమ్మల్ని కలిశాము. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్ససభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలి

*అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుంది. నర్సాపురం నియోజకవర్గంలో చట్ట బద్ధంగా ఎన్నికైన వ్యక్తి అవసరం. లోక్ సభలో కూర్చునే అర్హత లేని వ్యక్తి  జాప్యం వల్ల పార్లమెంటు సమావేశాలకు  హాజరవుతున్నారు. అది అనైతికం

*అనర్హత  నిర్ణయం తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇకనైనా వేగంగా పిటిషన్ పై చర్యలు తీసుకోవాలి

*సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంది.

 

One thought on “లేఖ ఇచ్చి 11 నెలలైంది, రఘురాముడి మీద వేటేయరా?:వైసిపి అసహనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *