కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం అమర్ నాథ్ యాత్ర ను రద్దు చేసింది. అమర్ నాథ్ యాత్ర ఇలా రద్దుకావడం వరుసగా ఇది రెండో సారి.
సాధారణంగా ప్రతిఏడాది జూన్ 28 న యాత్ర మొదలవుతుంది. ఇది 56 రోజుల పాటు సాగుతుంది. ఆగస్టు 22న రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ యాత్ర ను రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.అయితే నామమాత్రంగా యాత్ర సాగుతుంది. అమర్ నాథ్ గుహ వద్ద సాంప్రదాయికంగా పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
“ప్రజలజీవితాలను భద్రత కల్పించడమనేదిచాలాముఖ్యం. అందువల్ల ఈ సారి అమర్ నాథ్ యాత్ర నిర్వహించడం ప్రజాప్రయోజనాలరీత్యా అభిలషణీయం కాదు, అని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. యాత్రను అనుమతించాలా వద్దా అనే విషయం మీద శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అపుడే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Shri Amarnathji Yatra cancelled in wake of Covid-19 Pandemic. Decision after threadbare discussion with Shri Amarnathji Shrine Board members. Yatra to be symbolic only. However, all the traditional religious rituals shall be performed at the Holy Cave Shrine as per past practice.
— Office of LG J&K (@OfficeOfLGJandK) June 21, 2021