బంగారు తెలంగాణ లో భాగంగా హన్మకొండ లో అద్భుతంగా అరవై ఐదు లక్షల నిధులతో న కాళోజీ భవన్ నిర్మిస్తామన్నారు. శంఖుస్థాపన చేశారు. ఏమయింది? నాలుగేండ్లుగా నత్తనడక పనులు కొనసాగుతున్నాయి. కాళోజి నిజాం కాలం నుంచి తెలంగాణ నిరసన గొంతు వినిపించిన వాడు. ఆయబ పేరుమీద పెట్టాలన్న భవన్ కు ఇంత అన్యాయం జరుగుతుందనుకో లేము. కానీ, ఏమయింది?
హన్మకొండలో ఏకైక పబ్లిక్ గార్డెన్ పునర్నిర్మాణ పనులు ఆరంభించి ఐదేండ్లు గడిచినా అతీలేదు గతీ లేదు.
కేంద్రప్రత్వం ద్వార నూటాముప్పై కోట్ల నిధులతో కేయంసీ ప్రాంగణంలో అన్ని హంగులతో నిర్మాణమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మోక్షంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్లిస్తే అన్ని విధాల సేవలందించడం మొదలవుతుందని ప్రతిపక్షాలు,మేధావులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
కేసీయార్ ప్రగతి భవన్ గోడలు దద్దరిల్లేలా మొత్తుకున్నా నేటికి ఇన్ పేషంట్ సేవలకు నోచుకోలేదు.
వందల సంత్సరాల చరిత్ర గల అద్భుతమైన కట్టడాలను ఆఘమేఘాల మీద కూల్చేయించి
అదే స్ధలంలో మళ్ళీ ఇప్పుడు ముప్పై అంతస్తుల నిర్మాణాల ఆసుపత్రి తదితర అద్భుతాలు జరుగుతాయని చెబుుతూఉన్నారు.
పై ఉదాహరణలు చూసాక 24 అంతస్థుల ఆసుపత్రి అక్కడ లేస్తుందంటే ఎలా నమ్మేది ?