రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP)లో తిరుగుబాటు వచ్చింది. పార్టీకి చెందిన అయిదుగురు ఎంపిలు తిరుగుబాటు చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసి, ఆయన బాబాయ్ పశుపతి కుమార్ పాశ్వాన్ కు జైకొట్టారు. తమ నాయకుడు చిరాగ్ కాదని, పశుపతి అని వారు ప్రకటించారు. పార్లమెంటులో తన పార్టీ నాయకుడు పశుపతి పాశ్వాన్ అని చెబుతూ వారంతా స్పీకర్ ఒమ్ ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు.
తాను పార్టీని చీల్చలేదని, పార్టీని కాపాడానని పశుపతి ప్రకటించారు. అంతేకాదు, తమ పార్టీ బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఎలో భాగస్వామిగా కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించారు.
పాశ్వాన్ మరణించాక ఎల్ జెపికి చిరాగ్ నాయకుడయ్యారు. తర్వాత ఆయన ఎన్ డిఎ నుంచి బయటకు వచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఎన్ డిఎ నుంచి బయటకు వచ్చి బీహార్ 143 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నాయకత్వంలో పోటీ చేయడం ఇష్టం లేక చిరాగ్ ఎన్డీయే నుంచి వైదొలిగారు. 137 స్థానాల్లో పోటీల చేశారు అయితే, ఒకే ఒక్క సీటు గెల్చుకున్నారు. అయితే, నితిష్ సీట్లు బాగా పడిపోయందుకు ఎల్ జెపి ప్రత్యేకంగా పోటీ చేయడమే కారణమని విశ్లేషకులుచెబుతారు.
ఎల్ జెపిని రామ్ విలాస్ పాశ్వాన్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.