న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు. బిజెపి కేంద్ర నాయకుడు డిపి ప్రధాన్ ఆయనకు పార్టీ సభ్యత్వం అందించి కాషాయపార్టీలోకి ఆహ్వానించారు.
బిజెపి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని ఈ సందర్భంగా మాటాడుతూ ఈటెల అన్నారు.
తెలంగాణలో బీజేపీ నీ అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని,దక్షిణ భారత దేశంలో తెలంగాణ లో బీజేపీ నీ విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తాని ఆయన హామీ ఇచ్చారు.
బీజేపీ లోకి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.