వరంగల్ లో వస్తున్నది 24 అంతస్థుల ‘కెనడా మోడెల్’ ఆసుపత్రి,

వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దుతారు.   24 అంతస్థుల ఆసుప్రతి ప్రభుత్వరంగంలో  దేశంలో ఇదే  మొదటి కావచ్చు.  అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మిస్తారు. కెనడా మోడల్ లో, ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముంటుంది. దీనికోసం అధికారులు, డాక్టర్లు   కెనడా పర్యటిస్తారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.

ఇవాళ ప్రగతి భవన్ లో  జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి,  పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సమీక్షిస్తూ ముఖ్యమంత్ర ఈ విషయాలను వెల్లడించారు.

కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. ఇటీవలే 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఈ సెంట్రల్ జైలు కూల్చివేత కూడా జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *