తెలంగాణలో తొందర్లో పార్టీ ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. రైతులను కలుసుకుని ధాన్యం సేకరణ సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు వివరిస్తున్నారు రైతులు.తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. pic.twitter.com/OrFxYE1ZVm
— Team YS Sharmila (@TeamYSSR) June 11, 2021