భారత్ బయోటెక్, భారత ప్రభుత్వ పరిశోధనా సంస్థ ఐసిఎంఆర్ సహకారంతో అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ కు అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈవ్యాక్సిన్ ఆక్స్ ఫోర్డ్- యాస్ట్రా జెనెకా కోవిషీల్డ్అంత శక్తివంతమయింది కాదని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నపుడు ఎక్కువ యాంటిబాడీలు పెద ఎత్తున ఉత్పత్తి అవుతన్నాయని, కోవాగ్జిన్ తీసుకున్నపుడు తక్కువ గా ఉంటున్నాయని అన్నారు. కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు పెంచడానికి కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ఐసిఎం చీఫ్ కూడా ఇదే నిర్ధారించారు. ఈనేపథ్యంలో నిన్న భారత్ బయోటెక్ ఒకప్రకటన విడుదల చేస్తూకోవాగ్జిన్ తీసుకుంటే తక్కువ యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయన్నవాదనను తిరస్కరించంది.
అయితే, ఈ క్లారిఫికేషన్ వచ్చిన 24 గంటల్లోనే అమెరికా చెందిన టాప్ హెల్త్ రెగ్యులేటర్ FDA (Food and Drug Administration) కోవాగ్జిన్ కు అత్యవసరసమాయాలలో వాడేందుకని చెప్పి ఇచ్చే (emergency use) అనుమతిని నిరాకరించింది.
ఎమర్జీన్సీ యూజ్ అప్రూవల్ కోసం భారత్ బయోటెక్ చేసిన దరఖాస్తును ఎఫ్ డిఎ తిరస్కరించింది. కోవాగ్జిన్ కుసంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా లేదని, ఈ డేటా వచ్చేంతవరకు అనుమతినీయడం జరగదని ఎఫ్ డిఎ పేర్కొంది. దీని వల్ల ఆమెరికాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ వాడకం బాగా డిలే అవుతుంది. భారత్ బయోటెక్ తన ఆమెరికా భాగస్వామి అక్యూజెన్ ఇన్ కార్పొరేటెడ్ (Ocugen Inc)ద్వారా అమెరికా కోవాగ్జిన్ ను విడుదల చేయాలనుకుంటున్నది.