ఉత్తర బంగాాఖాతం & పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియర్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం తో ఈ రోజు వాయువ్య బంగళా ఖాతం &ఒదిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఆవర్తనము వ్యాపించింది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒదిశా మీదగా వెళ్ళే అవకాశం ఉంది.
ఈ రోజు అల్పపీడన ప్రాంతం నుండి ఒడిస్సా మీదగా తెలంగాణా వరకు ద్రోణి ఏర్పడింది
వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు (11వ తేదీ) తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు,ఎల్లుండి (12,13వ.తేదీలు) అనేక ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:- (weather warnings)
రాగల 3 రోజులు (10,11,12వ.తేదీలు) ఉరుములు , మెరుపుల, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మి వేగంతో)కూడిన వర్షం తెలంగాణాలో అన్ని జిల్లాలలో కురియవచ్చు. భారీ వర్షములు ఈరోజు కొన్ని ప్రదేశములలో (ముఖ్యంగా మధ్య,ఉత్తర, తూర్పు జిల్లాలలో), రేపు,ఎల్లుండి(12,13వ తేదీలు) కురియవచ్చు. అలాగే భారీ నుండి అతి భారీ వర్షములు కూడా ఒకటి రెండు ప్రదేశములలో (ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో) వచ్చే అవకాశాలున్నాయి.
ఈ రోజు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా( ముఖ్యంగా ఉత్తర, తూర్పు,మధ్య జిల్లాలలో) విస్తారంగా వర్షములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ మరియు భారీ నుండి ఆతి భారీ వర్షములు 12,13 తేదీలలో కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, సంచాలకులు తెలిపారు.