వ్యాక్సిన్ తీసుకోబోతున్న రామ్ దేవ్… జ్ఞానోదయానికి కారణంబేమిటి?

ఆల్లో పతి వైద్యాన్ని ఎంత దూషించినా, కష్టకాలంలో యోగ గురు బాబారామ్ దేవ్ కు  క్లిష్టసమయాల్లో ఆయనను ఆదుకున్నది కూడా ఆల్లో పతి వైద్యమే. ఇపుడు కరోనా రాకుండా దేశ ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ప్రభుత్వం పేర్కొంటున్నది. ఈ మాటను పెడచెవిన పెట్టే పరిస్థితి లేదు బాబాకు. అందుకే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటునారు. అందుకే కొద్దిగా మాటమార్చి ఆల్లో పతి గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడారు. ఎమర్జన్సీ సమయాల్లో ఆల్లో పతి బెటర్ అని కొనియాడారు.అయితే, నయంకాని అనేక జబ్బులకు ఆయుర్వేదమో దిక్కు అని కూడా అన్నారు.

గతంలో 2011లో ఒక సారి బాబా రామ్ దేవ్  అవినీతికి వ్యతిరేకంగా ఏడు రోజులు  నిరాహారదీక్ష జరిపి జబ్బు పడినపుడు కూడా ఆయనను డెహ్రాడూన్ లోని ఆసుప్రతిలో ఐసియులో చేర్చి ద్రవాలు ఎక్కించి ఆదుకున్నది ఇంగ్లీష్ వైద్యులే. అపుడాయన ఐసియు నుంచి పరిగెత్తి పోయి తన సొంత మందులు వాడేందుకు సాహిపంచలేదు.

ఈ వైద్నాన్ని ఈ మధ్య స్టుపిడ్ సైన్స్ అని శపించారుకూడా. ఇలాంటి బాబా ఇపుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. కోవిషీల్డ్ తీసుకుంటారా, కోవాక్సిన్ తీసుకుంటారా లేక రష్యా వాళ్లు తయారుచేసిన స్పుత్నిక్ V తీసుకుంటారా? ఈ విషయం ఆయన వెల్లడించలేదు.

అయితే, ఇంటర్నేషన్ యోగా డే (International Yoga Day) అయిన జూన్ 21 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందిరికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినందుకు ఆయన ప్రధానిని ప్రశంసించారు. తాను కూడా తొందర్లో వ్యాక్సిన్ తీసుకుంటానని చెబుతూ దేశ ప్రజలంతా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అల్లోపతి మీద నిప్పులు చెరిగిన రామ్ దేవ్ లో ఎంత మార్పు వచ్చింది?  కోవిడ్ కు విరుగుడుగా వ్యాక్సిన్ లు పనిచేయడం మీద కూడా ఆయన అనుమానం వ్యక్తం చేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. వేలాది మంది డాక్టర్లు, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కోవిడ్ వచ్చి చనిపోయారని ఆయన పదే పదే అంటూ వచ్చారు. ఇలాంటి వ్యక్తి ఇపుడు వ్యాక్సిన్ తాను తీసుకోవడమే కాదు, దేశ ప్రజలంతా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఇపుడాయన చాలా మారిపోయారు. “నా పోరాటం డాక్టర్ల మీద కాదు, వాళ్లు భూమండాలనికి వరం లాంటి వాళ్లు. నా పోరాటమంతా మందుల మాఫియా మీదే,’ అని  రామ్ దేవ్ ఇపుడు వాదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *