బ్రేక్ త్రూ కరోనావైరస్ ఇన్ ఫెక్షన్ అంటే ఏమిటి?

ప్రపంచంతా వ్యాక్సిన్ కన్ ఫ్యూజన్ దట్టంగా ఉంది.  వ్యాక్సిన్ తీసుకుంటే కరొనా ఇన్ ఫెక్షన్ వస్తుందా, రాదా? కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకున్నా కోవిడ్ వస్తున్నది, రెండు డోసులు తసుకున్నా కోవిడ్ వస్తున్నది. ఎందుకొస్తున్నది? వ్యాక్సిన్ ఒక డోస్ కు , మరొక డోస్ కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి. రెండు డోసులు పరిపోతుందా లేక ప్రతి సంవత్సరంలో బూస్టర్ డోస్ వేస్తుకుంటూ ఉండాలా ఇన్ని అనుమానాలో. ఇపుడిపుడే ఒక విషయం అర్థమవుతూ ఉంది. అందేంటంటే, ఏ వ్యాక్సిన్ కోవిడ్ సోకకుండా 100 శాతం గ్యారంటీ ఇవ్వలేదు. కాకపోతే, 90 శాతం ప్రజల్లో, జబ్బు ముదురకుండా  మరణం సంభవించకుండా కాపాడతాయని అనేక పరిశోధనలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రాసింది.

ఈ మధ్య  ప్రముఖ తెలుగు హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఈ కన్ఫ్యూజన్ కు ఒక ఆసక్తికరమయిన వివరణ ఇచ్చారు.

కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ చాలడం లేదని, అందువల్లే మొదటి డోస్ తీసుకున్నాక కోవిడ్ సోకుతున్నదని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ సోకిన కేసులపై పరిశోధన సాగిందని,   మొదటిడోస్  ప్రభావం మూడు వారాల మించి ఉండటం లేదని అందుకే కోవిడ్ వస్తున్నదని ఈ పరిశోధనలో తేలింది. దీని తర్వాత ఇంగ్లండ్ కు చెందిన పబ్లిక్ హెల్త్ వర్కర్లు  కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి  12వారాలనుంచి 16 వారాలకు పెంచడం మంచిది కాదని, దీనిని  మొదట అనుకున్నట్లు ఆరువారాలకు కుదించాలని కోరారు.
ముఖ్యంగా కరోనా వైరస్ డెల్టా వేరియాంట్ (ఇండియన్ వేరియాంట్) ఇంగ్లండులో వ్యాప్తి చెందాక  గ్యాప్ కుదించడం అసవరమని వారు కోరారు.దీనితో  ప్రభుత్వం (National Health Service : NHS) ఆరు వారాలకు గ్యాప్ ను కుదించింది.

 

ఇండియాలో మాత్రం  12 వారాల నుంచి 16 వారాల  గుడువు ను కొనసాగిస్తున్నారు.

ఈ విషయాన్ని ఉదహరిస్తూ భారతదేశంలో కూడా కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి ని 6 నుంచి 8 వారాలకు తగ్గించాలని  ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎఐఐఎంఎస్ లో హృద్రోగ విభాగం లో పనిచేసిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇపుడు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛెయిర్మన్ గా ఉంటున్నారు.

Like this story? Please share it with a friend!

ఇపుడు తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(NCDC) నుంచి మరొక షాకింగ్ న్యూస్ వెలువడింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్‌ (B.1.617.2) సోకే అవకాశం ఇక్కడి శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో స్పష్టమైంది. డెల్లా వేరియాంట్ లంటే మొదట ఇండియాలో కనిపించిన కరోనా వైరస్ రకం. దీనికే డెల్టా వేరియాంట్ అని పేరు పెట్టారు.

బ్రిటన్‌లో బయట పడిన ఆల్ఫా (Kent) వేరియంట్‌తో పోలిస్తే .భారత్‌లో గుర్తించిన డెల్టా రకానికి వ్యాపించే శక్తి 40-50 శాతం అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. లేటెస్టుగా ఎయిమ్స్ అధ్యయనం కూడా అదే విషయాన్ని తెలిపింది. వరుసగా ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన 63 మంది కరోనా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్టన్ (Breakthrough Infection) బాధితుల వివరాల్ని అధ్యయనం చేసి ఎయిమ్స్‌-ఐజీఐబీ ఈ విషయాలను తెలిపింది.

ఈ అధ్యయనం 2021 ఏప్రిల్ –మే నెలలలో జరిగింది. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక వచ్చిన కోవిడ్ ఇన్ ఫెక్షన్.

COVID-19 vaccines are effective. However, a small percentage of people who are fully vaccinated will get COVID-19 they are exposed to the virus that causes it. These are called ‘Vaccine Breakthrough Cases’.

బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ మీద దేశంలో జరిగిన మొదటి పరిశోధన ఇదే. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో పెద్దగా ఖాయిలా పడి, ఆసుపత్రిలో చేరి, మృత్యు వాత పడేవారి సంఖ్య బాగా తక్కువ అని అమెరికా లో జరిగిన ఇలాంటి అధ్యయనంలో వెల్లడయింది.

బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ స్టడీ కోసం తీసుకున్న 63 మందిలో 53 మంది కొవాగ్జిన్‌ మొదటి డోసు, మిగిలిన వారు కొవిషీల్డ్‌ ఫస్ట్ డోసు తీసుకున్నారు.

ఎఐఐఎంఎస్ స్టడీలో కూడా ఇదే కనిపించింది. వ్యాక్సిన్ బ్రేక్ త్రూ ఇన్ ఫెక్స్ చాలా మందిలో కనపించినా రోగం ముదరడం, చనిపోవడం జరగలేదు.

అంటే అమెరికాలో జరిగిన పరిశోధనను భారత పరిశోధన రుజువు చేసింది.
ఇందులో 36 మందికి రెండు డోసులు తీసుకున్నవాళ్లయితే 27 శాతం మంది ఏదో ఒక వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకున్నారు. ఒకే డోసు తీసుకున్న వారిలో 76.9% డెల్టా వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో 60 శాతం ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *