ఆంధ్ర ప్రదేశ్ కోవిడ్ కొత్త కేసుల నమోదు బాగా తగ్గుతూ ఉంది. గత 24 గంటలలో కేవలం 7796 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాలో చూస్తూ, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో తప్ప మిగతా 11 జిల్లాలలో కొత్త కేసులు వేయిలోపే ఉంటున్నాయి. ఏడు జిల్లాలలో 500 లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే పరిస్థితి బాగా అదుపులోకి వస్తున్నట్లే భావించాలి.
గత 24 గంటలలో రాష్ట్రవ్యాపితంగా 89,732 శాంపిల్స్ ని పరీక్షించగా 7,796 మం ది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కోవిడ్ వల్ల రాష్ట్రంలో 77 మంది మృతి చెందారు. వివరాలు: చిత్తూర్ జిల్లాలో పన్నెం డు మం ది, పశ్చిమ గోదావరిలో పది, అనంతపూర్ లో ఎనిమిది, నెల్లూరులో ఎనిమిది, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు.