సమ్మె నోటీసు ఇచ్చిన ఆంధ్రా రెసిడెంట్ వైద్యులు

ఈనెల 9 నుంచి విధులు బహిష్కరించనున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ రెసిడెంట్ వైద్యులు ప్రకటించారు.

ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని , జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆసుపత్రులలో భద్రతా ఎర్పాట్లు మరింత పెంచాలని డిమాండ్, తమకు ఇస్తున్న స్టయిఫండ్ లో టిడిఎస్ కోత విధించరాదని కూడా వారు కోరుతున్నారు.

ఈ డిమాండ్ల ను అంగీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం తో 9 న కోవిడ్ కు సంబంధం లేని విధుల బహిష్కరించాలని వారు నిర్ణయించారు.

సమ్మె కార్యక్రమం ఇదే…

10 న కోవిడ్ సంబంధిత విధుల బహిష్కరణ

11 న కోవిడ్ సంబంధం లేని అత్యవసర విధుల బహిష్కరణ..

12 న కోవిడ్ సంబంధిత అత్యవసర విధుల బహిష్కరణ..

న్యాయమైన డిమాండ్ లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *