“కోవిషీల్డ్ డోసుల మధ్య 12 వారాల గ్యాప్ మంచిది కాదు”

కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఉన్న 12 వారాల నుంచి 16 వారాల దాక ఉన్నగ్యాప్ ను  8 వారాలకు తగ్గించాలని  కేంద్ర ప్రభుత్వానికి నిఫుణులు సూచిస్తున్నారు.

ఒక డోస్ కోవిషీల్డ్ వేసుకున్నవారిలో ఎక్కువగా కోవిడ్ వస్తున్నందున ఈ చర్య అవసరమని వారు భావిస్తున్నారు.

ఒక డోసువేసుకున్నాక కూడా కోవిడ్ సోకుతున్నందంటే, మొదటి డోస్ చాలడం లేదని,అది కోవిడ్ రాకుండా నివారించలేకపోతున్నదని చెబుతూ  తొందరగా రెండో డోస్ వేయాల్సిన అవసరం  ఉందని న్యూఢిల్లీలోని జాతీయ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్-ఇన్ స్టిట్యూట్ ఫర్ జినోమిక్స్ అండ్ ఇంటెగ్రేటిబ్ బయాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇపుడు దేశంలో కరోనావరస్ వేరియాంట్ (B.1.617.2) చాలా తొందరగా, వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని, దీని వల్ల పాక్షిక వ్యాక్సినేషన్ చాలాదని ఈ నిపుణులు అభిప్రాయపడ్డారు.

నిజానికి ఇంగ్లండులో జరిగిన మరొక పరిశోధనలో కూడా గ్యాప్ తక్కువ ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.  మే 22న వచ్చిన ఈ అధ్యయనం  ప్రకారం  యాస్ట్రా జెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్) B.1.617.2 వల్ల వచ్చే కోవిడ్ లక్షణాలకు మొదటి డోస్ వేశాక మూడు వారాలలో  33 శాతం సమర్థవంతంగా, రెండో డోస్ వేశాక 60శాతం సమర్థవంతంగా పరిచేసింది.

అందువల్ల ఇంగ్లండ్ హెల్త్ వర్కర్లు కూడా  12 వారాల గ్యాప్ ను 8 వారాలకు కుదించాలని కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో కూడా 12 వారాల గ్యాప్ ను 8 వారాలకు కుదించడం చాలా అవసరమని వారు ఇక్కడి నిపుణులు చెబుతున్నారు.

“India should consider the shorter interval between two doses because we know this variant is in wide circulation in the country,”అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ )ప్రెశిడెెంట్  డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కోవిషీల్డ్  వ్యాక్సిన్ డోస్ ల మధ్య ఉన్న 6 నుంచి 8 వారాల గ్యాప్ ను  మే నెలలో భారత ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచింది. ఇప్పట్లో దీనిని సవరించే మూడ్ లో అధికారులు లేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *