RSS చీఫ్ ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ బ్లూ టిక్ గల్లంతు

ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్  అకౌంట్ బ్లూ టిక్  ను ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ అకౌంట్ కు సంబంధించి బ్లూ టిక్ అంటే  అది అధికారిక అకౌంట్ అని, యాక్టివ్ గా ఉన్న అకౌంట్ అని అర్థం. ఈ అకౌంట్ ను ట్విట్టర్ వెరిఫై చేసిందని, దీనిని విశ్వసించవచ్చని అర్థం.

అయితే, ట్విట్టర్ ఎందుకో  మోహన్ భగవత్ అకౌంట్  గుర్తింపు తొలిగించింది. రోజు భారత ఉప  రాష్ట్ర పతి  ఎం వెంకయ్యనాయుడు  అకౌంట్ బ్లూ బ్యాడ్జ్ ను కూడా తొలగించి సంచలనం సృష్టించింది.అయితే, తర్వాత దీనిని పునరుద్ధరించింది. ఇదే వరసలో ఆర్ ఎస్ ఎస్ అధినేత అకౌంట్ గుర్తింపును తొలగించించింది.

ఈ మధ్య చాలా మంది ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుల అకౌంట్ల బ్లూటిక్ ను ట్విట్టర్ తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గోపాల కృష్ణ, అరుకుమార్, మాజీనేతలు సురేష్ సోని, సురేష్ బి జోషి అకౌంట్లు ఉన్నాయి.

ఆర్  ఎస్ ఎస్ ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ల వెరిఫికేషన్ మార్క్ ను ట్విట్టర్ తొలిగించిన విషయాన్ని  ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి రాజీవ్ తులి ధృవీకరించారు.

ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అకౌంట్ @MVenkaiahNaidu జూలై 2020  నుంచి పనిచేయడం లేదని, ట్విట్టర్ వెరిఫికేషన్ పాలసీ ప్రకారం, అకౌంట్ వాడకంల్ లేకపోతే,వివరాలు అసంపూర్ణంగా ఉన్నా వెరిఫికేషన్ బ్లూటిక్ ను తొలగించడంజరుగుతుందని ట్విట్టర్ సంజాయిషీ ఇచ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *