మంజుల్ కార్టూన్లపై కేంద్రం కన్నెర్ర, ఖాతరు చేయని ట్విట్టర్

– (రాఘవ శర్మ)

క‌రోనా సృష్టిస్తున్న విధ్వంసాన్ని కార్టూన్ వేసి చూపించ‌డం నేర‌మైపోయింది.

ప్ర‌ముఖ రాజ‌కీయ కార్టూనిస్టు (వ్యంగ్య‌చిత్ర‌కారుడు) మంజుల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ట్విట్ట‌ర్‌ సంస్థ‌ను కోరింది.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ సంస్థ ఆ కార్టూనిస్టుకు ఈ మెయిల్ ద్వారా ఈ విష‌యం తెలిపింది.

@MANJULtoons‘ పైన తాము ఎలాంటి చ‌ర్య‌తీసుకోలేమ‌ని ప్ర‌భుత్వానికి ట్విట్ట‌ర్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

“We have not taken any action on the reported content @MANJULtoons at this time as a result of this request,” అని ట్విట్టర్ స్పష్టం చేసింది.

మంజుల్ వేసిన ఆ కార్టూన్‌పైన కాకుండా మొత్తం అత‌ని ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పైనే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అత‌ను భార‌త‌దేశ చ‌ట్టాల‌ను ఉల్లంఘించార‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

ప్ర‌భుత్వ చ‌ర్య‌ను స‌వాలు చేయ‌డానికి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాల‌ని, పౌర‌హ‌క్కుల సంస్థ‌ల‌ను సంప్ర‌దించాల‌ని కార్టూనిస్టుకు ట్విట్ట‌ర్ సంస్థ సూచించింది.

తాను ట్విట్ చేసిన ఏ కార్టూన్ ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించిందో చెప్పాల‌ని, ‘జ‌య‌హో మోడీజీ స‌ర్కార్’ అని ప్ర‌భుత్వానికి స‌మాధానంగా మంజుల ట్వీట్ చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి రెండ‌వ ద‌శ‌లో ఎలా విజృంభిస్తోందో దాని భ‌యంక‌ర రూపాన్ని, భార‌త దేశంలో వాక్సిన్ ప్ర‌క్రియ ఎలా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోందో మంజుల కార్టూన్ వేశారు.

ప్ర‌భుత్వ ఆదేశానుసారం ఈ సామాజిక మాధ్య‌మం నుంచి ఏప్రిల్‌లో 52 ట్వీట్ల‌ను డౌన్‌లోడ్ చేసింది.

వీరు త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నార‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది.

ఈ ట్వీట్ల‌లో ఎక్కువ భాగం ఆస్ప‌త్రుల‌లో బెడ్ల, ఆక్సీజ‌న్‌, వెంటిలేట‌ర్ల, మందుల కొర‌త‌తో ఎలా వైద్య ఆరోగ్య రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూపించారు. అంతే.

ఈ మధ్య చాలా మంది ట్వీట్లను ప్రభుత్వ వత్తిడితే బ్లాక్ చేస్తున్నారు.

ఇలా బ్లాక్ అయిన వారిలో  కాంగ్రెస్ నాయ‌కులు ప‌వ‌న్ ఖేర్‌, రేవంత్ రెడ్డి, ప‌శ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘ‌ట‌క్‌, న‌టుడు వినీత్‌కుమార్ సింగ్‌, సినీ నిర్మాతలు వినోద్ క‌ప్రి, అవినాష్ దాస్‌ల ట్విట్లు ఉన్నాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *