అనేక ప్రపంచ స్తాయి ఐ.టి సంస్థలను తన కృషి తో తెలంగాణా కు రప్పించానని ప్రచారము చేసుకునే కెటిఆర్, వ్యాక్సిన్ కోసము పిలిచిన గ్లోబల్ బిడ్లలో ఒకరిని కూడా ఆకర్షించలేక ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు?
అటు దేశ వ్యాప్తంగా ఇటు తెలంగాణాలో ప్రజలను దిక్కుతోచని పరిస్థితి లోనికి నెట్టి వేయడానికి అటు మోడి ఇటు కెసిఆర్ ఇద్దరూ కారణమని ప్రజలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.
ఈ భాధ్యతను ఒక్కరి మీద ఒక్కరు నెట్టేయడము మాని తమ ద్వారా జరిగిన లోపాలను అంగీకరించి, చిత్తశుద్దితో ఈ గండము నుండి బయటపడేసే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా మందులు వ్యాక్సిన్ సౌకర్యాల మెరుగుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉన్నా, చేసుకుంటున్న ప్రచారానికి కొదువేమి లేదు.
సి.ఎస్. సోమేశ్ కుమార్ కూడా ప్రచార ఆర్భాటంలోకి దిగడముతో ఈ రాష్ట్రము ఎటు వైపు వెళ్ళుతుందనే ఆందోళన కలుగుతుంది. గతములో ఏ సి.ఎస్ కూడా ఇంత ప్రచార కాంక్షతో పని చేయలేదు.
వైద్య శాఖా వ్యవహారాలు తాత్కాలికముగా చూస్తున్న మరొక మంత్రి హరీశ్ రావుకు, ఈటెల బర్తరఫ్ తరవాత హుజూరాబాద్ లో పార్టీ వ్యవహారాలు చూసే భాధ్యత కూడా అప్పజెప్పారు. ఆయన ఏ భాధ్యతకు న్యాయం
చేకూరుస్తాడో చూడాలి.