మహారాష్ట్రలో సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపు … ఎలాగో తెలుసా?

రెండు మూన్నెళ్ల పాటు కోవిడ్ నరకంగా ఉండిన మహారాష్ట్ర విజయవంతంగా బయటపడింది. ఆ రాష్ట్రం  కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు తీసుకున్న విధానాలు, పాటించిన కఠిన నియమాలు ప్రశంసలందుకున్నాయి. అందుకే సోమవారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధావ్ థాకరే ప్రకటించారు. అయితే, ఇది రకాలుగా ఉంటుంది. రాష్ట్రంలోని జిల్లాల్లను అయిదు రకాలుగా విభజించి అన్ లాక్ చేస్తున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దు పోయాక జివొ విడుదల చేసింది.

ఇదే అయిదు రకాల అన్ లాకింగ్ విభజన

  1. ఇది లెవెల్ 1. ఇందులో కోవిడ్ పాజిటివి రేటు 5 శాతం లేదా అంతకంటే తక్కువ ఆసుపత్రులలో పడకలలో 25 కంటే తక్కువగా రోగులున్న జిల్లాలుంటాయి.  ఈ జిల్లాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి షరతులు నియమాలు ఉండవు. అన్ని కార్యకలాపాలు నార్మల్ గా సాగుతాయి. రెస్టరాంట్టు, షాపులు, మాల్స్, ధియోటర్లు,పబ్లు, జిమ్ లు, ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు, పెళ్లిళ్లు, అంతిమయాత్రలు  అన్నింటిని నార్మల్ గా అనుమతిస్తారు. లోకల్  రైళ్లను మాత్రం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధారిటీ అనుమతిత్ నడపవచ్చు.
  2. లెవెల్ 2. ఇక్కడ 5 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు ఉండి ఆసుపత్రి  పడకలు  25 నుంచి 40 శాతం నిండిఉన్న జిల్లాలు ఇందులో ఉంటాయి. ఈ జిల్లాలో   144 సెక్సన్ అమలులో ఉంటుంది. ధియోటర్లు, మాల్స్, రెస్టరాంట్లు, జిమ్ లు,  సెలూన్లు,  బ్యూటీ పార్లర్లు  50 శాతం కెపాసిటీతో పని చేయాలి.లోకల్ ట్రెయిన్స్ కు అనుమతి లేదు. షాపులు వర్కింగ్ అవర్స్ ప్రకారం పనిచేస్తాయి. ముంబాయి మహానగరం లెవెల్ 2 పడిపోయింది.
  3. లెవెల్ 3.  కోవిడ్ పాజిటివిటీ   రేటు 5 నుంచి 10 శాతం తో ఆసుపత్రుల ఆక్యపెన్సీ 40 శాతం నుంచి 60 శాతం  ఉన్న జిల్లాలు ఇందులో ఉంటాయి. ఈ జిల్లాలలో నిత్యావసర  సరుకులు అమ్మే దుకాణాలను మధ్యాహ్నం నాలుగు గంటలదాకా వారమంతా తెరచి ఉంటాయి. ఇతర దుకాణాలు  వీక్ డేస్ లో మాత్రమే తెరచి ఉంచుతారు. మాల్స్, ధియోటర్స్  పనిచేయవు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిమ్స్, సెలూన్లను మధ్యాహ్నం నాలుగు దాకా తెరచి ఉంచుతారు. మధ్యాహ్నం నాలుగు తర్వాత టేక్ అవే సర్వీసులను అనుమతిస్తారు. నిర్మాణపుపనులను  50 శాతం సిబ్బందితో అనుమతిస్తారు.  ప్రయివేటు కార్యాలయాలు వీక్ డేస్ లో మధ్యాహ్నం నాలుగు దాకా అనుమతిస్తారు.
  4. లెవెల్ 4. కోవిడ్ పాజిటివిటి  10 నుంచి 20 శాతం ఉంది,  ఆసుపత్రి  పడకల ఆక్యుపెన్సీ  60 నుంచి 75 శాతం దాకా  జిల్లాలు లెవెల్ 4 లో ఉంటాయి. నిత్యావసర సరకులు దుకాణాల మధ్యాహనం 4 దాకా తెరచిఉంచుతారు. మధ్యాహ్నం  5 తర్వాత కర్ఫ్యూ మొదలవుతుంది. శని, అధివారాల్లో పూర్తి లాక్ డౌన్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను  50 శాతం కెపాసిటీతో అనుమతిస్తారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
  5. లెవెల్ 5. ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివిటి రేటు 20 శాతం లేదా అంతకంటేఎక్కువగా ఉంటుంది.  ఆసుపత్రుల ఆక్యుపెన్సీ 75 కంటే ఎక్కువగా ఉంటుంది.ఇక్కడ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక్కడ బయట తిరగాలన్నా, ఈ జిల్లాలలోనికి రావాలన్నా ఇ-పాస్ అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *