గత రెండు రోజులుగా ఆనందయ్య మందు సప్లైచేసేందుకు ఒక వెబ్ సైట్ తయారయిందని విపరీతంగా ఒక పోస్టు షేర్ అయింది. కొంతమంది అమయాకులు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మందు సక్రమంగా అందించేందుకు ప్రారంభించిన వెబ్ సైట్ అని భ్రమించారు. నిజానికి ఈ వైబ్సైట్ childeal.in అనేది ప్రయివేటు వెబ్ సైట్. ఆనందయ్య మందును విక్రయించేందుకు ఏర్పాటయిన వ్యాపారం ప్లాట్ ఫాం. మరి దీనికి అనందయ్య ఎందుకు అంగీకరించారో, ఆయనను ఎలానమ్మించారో తెలియదు గాని, ఈ వెబ్ సైట్ ను తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత(SESRITHA) కంపెనీ. దీనివెనక సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే గోవర్దన్ రెడ్డి ఉన్నాడని, అదొక భారీ కుట్ర అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. ఇపుడు ఆనందయ్య కుటుంబం కాకాణి కనెక్షన్ ను ప్రశ్నించడంతో వెబ్ సైట్ పక్కన పడింది. childeal.in కాకాని కనెక్షన్ ఆయన ఆధారాలతో సహా నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బయటపెట్టారు.
సోమిరెడ్డి వెల్లడించిన ఆసక్తికరమయిన విశేషాలు
కృష్ణపట్నంలో కాకాణి మందు పంపిణీ చేపట్టిన మే 21వ తేదీనే గోడాడీ కంపెనీ వద్ద డొమైన్ కొనుగోలు చేసిన సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్.
సెశ్రిత కంపెనీ నిర్వాహకులు కాకాణికి, అధికార పార్టీకి అత్యంత సన్నిహితమైన వారు.
హైకోర్టు మందు పంపిణీకి అనుమతించిన 31వ తేదీనే ఆన్ లైన్ లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి
జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్ లో కనిపించిన chiledeal.in వెబ్ సైట్.
ఫ్యాన్ గుర్తు సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీ. నకిలీ మద్యం, నకిలీ పత్రాలకు తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన.ఆనందయ్య మందు ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా వసూలు చేసేందుకు కుట్ర.
ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం. ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో కలవరం. కథ అడ్డం తిరిగందని భావించి వెబ్ సైట్ ను హడావుడిగా పక్కనపెట్టారు.
అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయింపు. ఆనందయ్య మందుకు తమకు, తమ పార్టీకి సంబంధం లేదని హడావుడిగా ప్రకటన. లేదంటే వందల కోట్లు దోచుకునేందుకు భారీ స్కెచ్. ప్రభుత్వం స్పందించి ఈ కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఈ వెబ్ సైట్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి చర్యలు తీసుకోవాలి.
లేదంటే మేమే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాం.
సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్ కుమార్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితరులు..