కెసిఆర్ ని కుతంత్రాలు, డబ్బు సంచులు కాపాడలేవు…

ముఖ్యమంత్రి కెసిఆర్ డబ్బుతో, కుతంత్రాలతో, అణచివేతతో పాలిస్తున్నాడని, ఇదెంతో కాలం సాగదని తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

ఈ రోజు శామీర్ పెట్  నివాసం  నుంచి విలేకరులతో మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని కెసిఆర్ ఎలా నడుపుతున్నారో, అణిచివేతను ఎలా ప్రయోగిస్తున్నాడో ఆయన వివరించారు.

మంత్రి పదవి ఇచ్చి బానిసలాగా బతకమంటే కుదురదు అని  ఈటెల వ్యాఖ్యానించారు.

“టిఆర్ఎస్ ని లలూ ప్రసాద్, మాయావతి, జయలలిత ల నడిపిన పార్టీ వంటి కాదు. ఇది తెలంగాణ పార్టీ. ప్రజలు పెట్టిన పార్టీ. ‘ఇది తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ, తప్పుచేస్తే రాళ్లతో కొట్టండి,’ అని నువ్వే చెప్పావు. ఇపుడేం చేస్తున్నావు. నీ పార్టీ చూసి ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. పార్టీలో ఉన్న వాళ్లు బయటకు పోతున్నారు. నిన్ను కనురెప్పలాగా కాపాడుకున్నోళ్లను పార్టీ నుంచి తరిమేస్తున్నావ్. ఇంట్లో వుండాల్సిన వాళ్ల బయటకు పోతున్నారు. బయట ఉండాల్సిన వాళ్లు ఇంట్లోకి వస్తున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రయోగిస్తున్నావ్. అయితే, నేను భయపడను. ఆత్మగౌరవం కోసం బతుకుతాను. ఆస్తినంతా అమ్ముకునయిన బతకు, ఆత్మగౌరవం కాపాడుకో అని నా భార్య ప్రకటించింది. అదే నా మార్గం,”

“కెసిఆర్ డబ్బులు, కుతంత్రాలు, అణచివేతలు ఇపుడు పనిచేయవచ్చు. ఇదెంతో కాలం సాగదు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తారు.  వాళ్లు తిండిలేక పస్తులుంటారు గాని, అవమానాాలను, పరాభవాలను భరించారు.  అపుడు తిరగబడతారు,”  అని ఆయన అన్నారు.

సిఎం ఆఫీసులో ఒక్క ఎస్ సి ఉన్నాడా, బిసి ఉన్నాడా, ఐఎఎస్ ఉన్నాడా… ఆలోచించండి. అంటే ముఖ్యమంత్రి ఎలాంటా ఉద్దేశంతోనో ఎలాంటి పాలన చేస్తున్నాడో అర్థం చేసుకోండని ఆయన అన్నారు

ముఖ్యమంత్రి  కార్యాలయంలో ఒక్క ఎస్సి, బిసి, ఐఎఎస్ అధికారలు ఎందుకు లేరు అని ప్రశ్నిస్తూ, ఇదే ఉద్దేశ పూర్వకంగా ముఖమంత్రి కెసిఆర్  చేేస్తున్నారని ఈటెల  ఆరోపించారు.

ప్రగతి భవన్ బానిస కార్యాలయం అయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వర్గాలను ఉద్యమంలోకి తీసుకువచ్చేందుకు మాత్రమే ఉద్యమకాలంలో ఇది బిసి రాష్ట్రమని, ఎస్ సి ముఖ్యమంత్రి అని మాట్లాడారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంత నిరంకుశంగా పాలిస్తున్నారో ఆయన వివరించారు.ఆయనకు మంత్రులను, ప్రజాసంఘాల నేతలను కలుసుకోవడం ఇష్టం లేదని  అన్నారు.

తనకు ముఖ్యమంత్రికి వచ్చిన గ్యాప్ ఇప్పటిది కాదని, అయిదేళ్ల కిందటి దని ఆయన చెప్పారు. అక్కడ ఎందరో అవమానాలు ఎదుర్కొంటున్నారని, చివరకు ‘నన్ను బొంద పెట్టమని ’ అదేశాలు అందుకున్న ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ‘నాలాంటి’ అవమానాలే ఎదురుయ్యాయని ఆయన చెప్పారు. ” ఈ రోజు హరీష్ రావు  ముఖ్యమంత్రి ఆదేశాలతో పనిచేస్తూ ఉండవచ్చు. ఆయనకు జరిగిన బాధాకరమయిన అవమానాల గురించి హరీష్ కుటుంబ సభ్యులకు బాగా తెలుసు,” అన్ని అన్నారు.

కెసిఆర్ మంత్రులకు అప్పాయంట్ మెంట్ ఇవ్వరు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇవ్వరు. తెలంగాణ ఉద్యమానికి  గుండెకాయ వంటి ఎన్జీవో సంఘాల నేతలు ఒక్కసారి కలిసి ఒక వినతిపత్రం ఇచ్చిఫోటో తీసుకుంటామంటే బతిమాలినా కెసిఆర్ అనుమతి ఇవ్వలేదని ఈటెల అన్నారు.

“రాష్ట్రంలో ఏ సంఘాలు ఉండరాదు, ఉంటే గింటే కల్వకుంట్ల కవిత నాయకురాలిగా ఉండాలనే వత్తిడి తీసుకువస్తున్నారు. అందుకే ఈ రోజు సింగరేణి సంఘాలు, ఆర్టీసి  సంఘాలు నిర్వీర్యమయి పోయాయి. ఉన్న సంఘాలకు నాయకురాలు కవిత. ఉద్యమం కోసం మేం ప్రారంభించిన సంఘాలను కూడా ఈ రోజు కవిత లాగేసుకున్నారు.పాత లీడర్లను బలవంతంగా రాజీనామా చేయించారు,” అని ఈటెల అన్నారు.

“ఈరోజు తెలంగాణలో సంఘాలు ఉండరాదు, సమ్మెలే చేయరాదు. ఆరోజు సంఘాలు కావాలి, సమ్మెలు కావాలి. ఈ రోజు వద్దు.  ఇదే అణిచిివేత ధోరణి నాటి ఆంధ్ర పాలకులు అణచివేసి సంఘాలువద్దు,సమ్మెలు అంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉండేది. సంఘాలు ఉంటే చైతన్యం ఉంటుంది, చైతన్యం ఉంటే పోరాటాలు, తిరుగుబాట్లు ఉంటాయి.ఆందుకే సంఘాలు, సమ్మెలను నాడు ప్రో త్సహించిన ఇపుడు అణనివేస్తున్నారు,” అని ఈటెల అన్నారు.

రాష్ట్రంలో ఒక్క మంత్రికూడా స్వేచ్చగా పనిచేసే వీలే లేదు తెలంగాణలో అని ఆయన అన్నార

“మంత్రులకు  స్వేచ్ఛ లేదు, అధికారులకు స్వేచ్ఛ లేదు,స్వతంత్రంగా  పనిచేయలేరు. ఆయన చెప్పింది రాసుకోని రావలసిందే,”అని ఈటెల అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *