ఎమ్మెల్యే పదవికి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి ఈటెలరాజేందర్ రాజీనామా చేస్తున్నట్లుప్రకటించారు.
ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈవిసయం ప్రకటించారు.తనని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అందుకే తానే రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
రాత్రికి రాత్రి ఎంక్వయిరీ చేసి మంత్రిగా బర్తర్ ఫ్ చేశారు. వారు ఆదేశాలు ఇచ్చారు కింది సైపాతులకు, హారీస్ రావుకు, వినోద్ కు, సునీల్ రావు , ధర్మారెడ్డి గారికి.
హూజూరాబాద్ నియోజకవర్గంలో 20 సం.లాగా నన్ను కన్నెత్తి చూల్లే. సర్పంచు, జడ్ పిటిసి ఎనికలు జరిగినా వందశాతం గెల్చుకున్న చరిత్ర ఉంది. ప్రజల గుండెల్లో నాయకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. హోదాలు పక్కన పెట్టి కార్యకర్తులతో కలసి మెలసి జీవించాం.
ఈటెల రాజేందర్ ను బొందపెట్టమని ఆదేశాలు ఇచ్చారు.ఎన్నెన్ని రకాల ఆశలు చెప్పి, బెదిరించి, ప్రలోభాలు పెట్టినా మా వాళ్లు తట్టుకుని నిలబడ్డారు. రిపీటెడ్ గా దాడిజరగడంతో కొంతమంది వాళ్ళకు లొంగిపోవచ్చు.హుజూరాబాద్ ప్రజలు మాత్రం, ఈజెండాను,పార్టీని పెంచింది ఈటెలన్న అంటున్నారు. ఏంజరుగుతుందో చూస్తున్నాం బిడ్డా అంటున్నారు. దుఃఖం వస్తున్నదంటున్నారు.ప్రతి ఇంట్లో ఏదో కోల్పోయినట్లు బతుకుతున్నారు. నాకుదౌర్యం చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీ మీద జరుగుతున్న కుట్రలను,కుతంత్రాలను చేదిస్తాం, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నమని ప్రజలు హామీ ఇచ్చారు.
అందుకే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.