రెండు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి.గురువారం నాడు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల వచ్చిన తుఫానుల కారణంగా రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యమయింది వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు.
SOUTHWEST MONSOON HAS SET IN OVER SOUTHERN PARTS OF KERALA TODAY, THE 03RD JUNE, 2021. DETAILS IN THE PRESS RELEASE TO BE ISSUED SOON@rajeevan61
— India Meteorological Department (@Indiametdept) June 3, 2021
ఈ సారి రుతుపవనాల వల్ల కేరళలో వానల విస్తృతి కూడా పెరగనుంది. కేరళ మీద మేఘాలు ఆవరించడం కూడా చాలా ఎక్కువగా ఉంది.
సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. అయితే, ఈసారి ఒక రోజు ముందుగా మే 31నే వస్తాయని వాతావరణ శాఖ కొద్ది రోజులు కిందట ప్రకటించింది. అయితే, ఈ రెండు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి.
అయితే, రుతుపవన వానలు ఈసారి సాధారణంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది.
భారతదేశంలో నాలుగు నెలల పాటు రుతుపవనాలుంటాయి. ఏడాది వర్షపాతంలో 80 శాతం ఈ రుతుపవనాల వల్లే ఉంటుంది. ఆహారోత్పత్తిలో ఈ వర్షాలు చాలా కీలక పాత్రపోషిస్తాయి.