ఆంధ్రాలో కోటి మందికి పైగా కొవిడ్ టీకాలు

(డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా శ్రీకాంత్)

ఆంధ్రప్రదేశ్ లో కోటి మందికి పైగా కొవిడ్ టీకాలు వేశారు.

హెల్త్ కేర్ వర్కర్లు వృధా కాకుండా టీకాలు వేయడంవల్ల 2 లక్షల మందికి అదనంగా టీకాలు

కొవిడ్ వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,74,471 మందికి మొదటి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది

కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 98,85, 650 డోసులు అందాయన్నారు.

ఇందులో కేంద్రం నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 66,82,570 డోసులు, కోవాగ్జిన్ 15,17,450 డోసులు అందగా, రాష్ట్ర ప్రభుత్వం 13,41,700 కోవిషీల్డ్ డోసులు, 3,43,930 కోవాగ్జిన్ డోసులు కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 82,95,973 మందికి, కోవాగ్జిన్ 17,78,218 మందికి వేయించాము

ఇందులో మొదటి డోసు టీకా వేసుకున్నవారు 75,45,304 మంది, రెండు డోసులూ వేసుకున్నవారు 25,29,167

మొత్తం 98,85, 650 డోసులను హెల్త్ కేర్ వర్కర్లు ఎక్కడా వృధాకాకుండా టీకా వేయడంవల్ల అదనంగా సుమారు 2లక్షల మందికి టీకా అందించగలిగాము.

. దీంతో రాష్ట్రంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 1,00,74,471 మందికి చేరింది.

మరింత మంది కి వాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వము.

ఒక్క రోజులో 5 లక్షల కు పైగా వాక్సినేషన్ లు వేసి దేశం లోనే ప్రథమ స్థానం లో ఉంది మన రాష్ట్రం.

 

(డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా శ్రీకాంత్
ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *