పాలకులెవరైనా సరే రాయలసీమకు అన్యాయమమే జరుగుతూ ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అంటున్నారు. ఈ రోజు సిద్దేశ్వరం అలుగుకు ప్రజలే శంకుస్థాపన చేసిన సంఘటనను స్మరించుకుంటూ ఇళ్లనుంచే రాయలసీమ జిల్లాలో స్మారక సత్యాగ్రహం చేశారు. దీనిపై దశరథ్ ఏమంటున్నారో వినండి…
తరతరాలుగ రాయలసీమ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులు చర్యలను నిరసిస్తూ, రాయలసీమ అభివృద్ధికి కీలకమైన సాగు నీటి హక్కులకై సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేయడమైనది. వేలాదిమంది రాయలసీమ ప్రజలు ఐదేళ్ల క్రితం చేసిన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన రాయలసీమ అస్తిత్వ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రజల చేత సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన జరిగి ఐదవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజు మే 31 వ తేదీ సోమవారం నాడు రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక పిలుపు మేరకు కరోనా తీవ్రత దృష్ట్యా ఎవరికివారు వేలాది కుటుంబాలు గృహ సత్యాగ్రహ దీక్షలు చేపట్టి విజయవంతం చేసారని, ఈనాటి సత్యాగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొనడం అభినందనీయమని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వానికి పంపడమైనది.
రాయలసీమ ప్రాంత ప్రధాన డిమాండ్స్
#సిద్దేశ్వరం అలుగు తో కూడిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి.
#వాగులు, వంకల, కాలువల అనుసంధానం తో చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, సామాజిక అడువుల పెంపకంతో పర్యవరణ పరిరక్షణ, రాయలసీమ లోని పెన్నా, దాని ఉపనదుల పునరుజ్జీవనం తో కూడిన సమగ్ర రాయలసీమ ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు అత్యంత ప్రాధాన్యతతో చేపట్టండి.
#పట్టిసీమ, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్ధంగా కేటాయించండి.
#కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయండి.
#ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకముందు నిర్మాణం లో ఉన్న దుమ్ముగూడెం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాలకు వినియోగించండి.
#రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమలు పరచండి.
#అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ చేపట్టి రాష్ట్ర రాజధాని/హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయండి.
#తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం చేపట్టండి.
#గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టండి.
#వేదవతి పై బ్యారేజి నిర్మాణం చేపట్టి, ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర దిగువ కాలువ స్థిరీకరణ చేపట్టండి.
# హంద్రీనీవా సామర్థ్యం 22000 క్యూసెక్కులకు పెంచి ఆయకట్టుకు నీరందించండి.
#కండలేరు ద్వారా చిత్తూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించండి.
#ఆర్ డి ఎస్ కుడి కాలువ నిర్మాణం వేగవంతం చేయండి.
#మ్యాలిగ్నూరు నుండి కొత్తపల్లి వరకు తుంగభద్ర వరద కాలువ నిర్మించండి.
#విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు కర్మాగారం కడప లో ఏర్పాటు చేయండి.
# విభజన చట్టంలో పేర్కొన్న AIMS ను అనంతపురంలో లో ఏర్పాటు చేయండి.
# విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ గుంతకల్లు లో ఏర్పాటు చేయండి
# లేపాక్షి నాలెడ్జ్ హబ్ ను ఐ టి కారిడార్ గా అభివృద్ధి చేయండి.
# జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కర్నూలు జిల్లా తంగెడంచలో ఏర్పాటు చేయండి.
పై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి గారికి పంపడమైనది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/rayalaseema-siddheswaram-alugu-deeksha/