ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 13,400 కోవిడ్19 పాజిటివ్ లు కనిపించాయి. మొత్తంగా 84,232 శాంపిల్స్ ని పరీక్షించారు. ఇది అంతకు ముందటి 24గంటల కాలంలో కనిపించిన కేసుల 13,756 కంటే తక్కువ.తగ్గుదల కొంచెమే అయినా పెరగపోవడమనేది ఊరటనిచ్చే విషయం. మొత్తానికి ఆంధ్రలో కోవిడ్ పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది.
కోవిడ్ మరణాలకు సంబంధించి, చిత్తూర్ లో పద్నాలుగు మంది, ప్రకాశం లో తొమ్మిది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది, విశాఖపట్నంలో ఎనిమిది, కృష్ణలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు,
కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు
వైఎస్ఆర్ కడపలో నలుగురు మరణించారు.
జిల్లాల వారీగా కొత్త పాజిటిక్ కేసులు వివరాలు