ఇంకా తగ్గిన ఆంధ్ర కోవిడ్ కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గత  24 గంటలలో అంతకు ముందటి  కంటే బాగా తక్కువగా  13756 కొత్త పాజిటివ్ కేసుు మాత్రమే  నమోదు అయ్యాయి. అయితే మృతులు మాత్రం  104 మంది మృతి. నిన్న మొత్తంగా 79,564 శాంపిల్స్ పరీక్షించారు.అంతకు ముందు రోజు  14 వేల పైబడి కొత్త కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.

జిల్లాల వారీగా మృతులు:  కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో  ఎక్కువ మంది  ఇరవై మంది చనిపోయారు. చిత్తూర్ లో పదమూడు మంది,
విశాఖపట్నంలో పది మంది, అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరిలో తొమ్మిది, గుంటూరు లో ఎనిమిది, కృష్ణలో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు,  ప్రకాశంలో ఒక్కరు మరణించారు.

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుతున్న సంగతి తెలిసిందే.మే 17న పాజిటివిటీ రేటు 25.56 శాతం. అంటే పరీక్షలు చేయించుకునన వారిలో  25 శాతం మందికి కోవిడ్ సోకిందన్న మాట. ఇదే పాజివిటీ రేటు
మే 27 నాటికి 19.20 శాతానికి తగ్గింది.గత 10–12 రోజలుగా  పాజిటివిటీ రేటు తగ్గుకుంటూ వస్తున్నది.

ఈ  రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *