పార్టీ ఆఫీసులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చిన  సిపిఎం

కోవిడ్ బాధితులును ఆదుకునేందుకు  భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఎం)  కార్యాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది.   కార్యాలయాల్లోరోగుల కోసం పడకలుఏర్పాటు చేశారు.ఆక్సిజన్ సిద్ధంగా ఉంచారు. రోగుల కోసంపౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. వీళ్ల ఆరోగ్యమ మానిటర్ చేసేందుకు డాక్టర్లను ఏర్పాటుచేశారు.ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో ఎలాంటి అసౌకర్యం కలిగకుండా పార్టీ కార్యకర్తలే వలంటీర్లుగా మారారు.

ఇలా సిపిఎం పార్టీ  కార్యాలయాల్లో  400 పడకలు ఏర్పాటయ్యాయి. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య  భవనం,  విశాఖపట్టణంలోని నండూరి ప్రసాదరావు భవనం,అనంతపురం లోని సింగమనేని నారాయణ స్మాకర కేంద్రంలతో పాటుమొత్తం అనే భవనాలను సిపిఐ కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది. ప్రజలనుంచి వచ్చే సాయంతో నే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నట్ల సిపిఎ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి మధు బిబిసి-తెలుగు కు చెప్పారు.

కోవిడ్ జబ్బు ప్రయివేటు వైద్యం చాలా ఖరీదుగా ఉంది. ప్రభుత్వాసుపత్రులుచాలడం లేదు. అందువల్ల  కోవిడ్ చికిత్సఅసవరమయిన పేదలకు ఈరూపంలో సాయంచేయాలని పార్టీ నిర్ణయించిందని మధు తెలిపారు. మొదట్లో పార్టీ కార్యకర్తలకోసం ఈ ఏర్పాటుచేయాలని భావించినా, సాధారణ ప్రజలకు కూడా తర్వాత దీనిని అందించాలని నిర్ణయించారు.విజయవాడల్ ఒక ఐసోలేషన్ కేంద్రం తెరిచారు. అక్కడ  200 మంది దాకా ఉపశమనం పొందారు. ఇదే విధంగా సుందరయ్య స్కిల్ డెవెలప్  మెంట్ కేంద్రాన్ని 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. విశాఖ జగదాంబ సెంటర్ లోని సిపిఎం కార్యాలయంలో  40 మంది కరోనా బాధితులున్నారు.

ఈ కేంద్రాల నిర్వహణకు ప్రజలనుంచి సహకారం అందడమే కాదు, డాక్టర్ల నుంచి మంచి స్పందన ఉంది. ఎంత్ బిజీగా ఉన్నప్పటికి చాలా మంది డాక్టర్  ఈసెంటర్లలోని రోగులను పరీక్షించేందుకు రెండుపూటలా వస్తున్నారని సిపిఎంనేత నర్సాంగారావు తెలిపారు.

రాష్ట్రం మొత్తంగా సిపిఎం కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులైన డాక్టర్ సహాకరంతో మొత్తం 40 కోవిడ్ కేర్ కేంద్రాలు నడుపుతున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా  రాసింది.  తెలుగు రాష్ట్రాలలో  ఏరాజకీయ పార్టీ ఇలా కార్యాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలేదు. ఇలాంటి పని మొదట చేసింది మార్కిస్టు పార్టీయే. చాలా పేదకుటుంబాలు ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తూంటాయి. అలాంటి ఇళ్లలో ఎవరికైనా కోవిడ్ సోకితే హోం ఐసోలేషన ్ సాధ్యం కాదు. అందువల్ల పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లు మార్చి  ఇలాంటి పేదవారికి సాయం చేయాలనుకున్నామని సిపిఎం కార్యదర్శి మధు టైమ్స్ కు తెలిపారు.

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం లోని బాలోత్సవ్ భవన్ ని మొదట కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు.  రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూండటంతో వసతులున్న పార్టీ కార్యాలయాన్నింటిని కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *