తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకునేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత వి హన్మంత రావు ప్రగతి భవన్ కువచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకోవడం మహామహులకే సాధ్యంకాదు, ఇక మాజీలకు దిక్కేం ఉంటుంది. ఆయనకు అప్పాయంట్ మెంట్ లేదు కాబట్టి అధికారుల లోనికి అనుమతించలేదు. అయితే తాను వచ్చింది ప్రజాసమస్య మీద అని చెప్పి ఆయన తన వినతి పత్రాన్ని పోలీసులకు సమర్పించారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని ఎన్నిసార్లు లేఖలు రాసిన వాటికి ఎలాంటి జవాబు రాలేదని, తెలంగాణలో ప్రజలు చస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని హన్మంతరావు అన్నారు. తాను రాసే లేఖలకు స్పందన లేదు, ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు అప్పాయంట్ మెంట్ రాదు, అని చెబుతూ తన లేఖని అక్కడి సెక్యూరిటీ అందించి వెళ్లారు. అదీ ప్రగతి భవన్ అంటే… దుర్బేధ్యం
కోవిడ్ తో చనిపోయిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది తాను ప్రజా సమస్యలపై సాగిస్తున్న పోరాటంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడు,సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు.అందుకే నేను అప్పాయంట్మెంట్ లేకుండా ప్రగతి భవన్ కు వచ్చాను,’ అని ఆయన చెప్పారు.