ఈ ల్యాంపు ను ఉప్పనీళ్లతో వెలిగించవచ్చు…

ఉప్పు నీళ్లతో వెలిగేదీపాల గురించి విన్నారా? నేను చెప్పింది కరెక్టు, సముద్రపుఉప్పునీళ్లతో వెలిగే లాంతర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరెపుడైన ఇలాంటి లాంతర్లు చూశారు.

ఆముదంతో దీపాలువెలిగించడం చూశాం. కిరోసిన్ తో లాంతర్లు వెలగడం  అందరికి తెలిసిందే. మరి ఆముదం దొరకదు, కిరొసినూ దొరకదు, సోలార్ లాంపులు కూడా అక్కడ పూర్తిగా పని చేయవు. నాగరికతకు దూరంగా, సూర్యకిరణాలు కూడాఏడాది పొడవునా కనిపించని ప్రదేశాలలో ఉండేవారికి వెలుతురు ఇచ్చేసాధనం ఏమిటి?

The WaterLight features a tubular wooden case (creidit:dezeen.com)

ఈ ప్రశ్న కొలంబియా శాస్త్రవేత్తలకు ఎదురయింది. ఎందుకంటే, కొలంబియా, వెనెజుల దేశాలు కలిసే,ఒక మారు మూల ప్రాంతంలో కొన్ని తెగలవాళ్లు నివసిస్తున్నారు. వాళ్లు శతబ్దాలుగా వాళ్లు చీకట్లో నే బతుకున్నారు, చీకట్లోనే  ప్రయాణా సాగిస్తుంటారు. పొద్దుగూకాక వెళ్తురు ఇచ్చే సాధనాలు ఆ ప్రాంతలోకి ప్రవేశించనే లేదు. అక్కడున్న వాళ్లకి లాంతర్లు తయారుచేయాలి ఎలా అని కొలంబియన్ రెనీవబుల్ ఎనర్జీ స్టార్టప్  ఇ.దీనా (E-Dina) ఆలోచించింది. అక్కడ సమృద్ధిగా దొరికేది సముద్రపు ఉప్పనీరు మాత్రమే. ఉప్పునీటిని ఇంధనంగా మార్చి లాంతర్లుచేయాలి. ఇలాంటి నీటి లాంతర్లు  తయారుచేసేందుకు ఇ.దీనా పని ప్రారంభించింది. విజయవంతమయింది.

ఈ సంస్థ కృషి ఫలితమే   వైర్లు లేని వాటర్ లైట్ (cordless Wateer Light) .దీనిని మన పెట్రో మాక్సలైట్ లాగా ఎక్కడికైనా ఎంతదూరానికైనా తీసుకుపోవచ్చు. ఇది కేవలం అర లీటర్ సముద్రజలం పోస్తే చక్కగా పనిచేస్తుంది. ఎమర్జీన్సీ వచ్చినపుడు సముద్ర జలం అందుబాటులో లేకపోతే మూత్రం తో కూడా పనిచేస్తుంది. ఒక్కసారి  అరలీటర్లు ‘ఇంధనం’ నింపితే వాడకాన్ని బట్టి  45 రోజుల దాకా పనిచేస్తుంది.

లాంతరే  కాదు, ఇది  మినీ పనవర్ జనరేటర్ లాగా కూడా పనిచేస్తుంది. దీనితో  మొబైల్ ఫోన్లు కూడా చార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఒక యుఎస్బి పోర్టు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

వుండర్ మన్ ధామ్సన్ కొలంబియా (Wunderman Thompson Columbia) అనే మరొక సంస్థ సహకారంతో ఇ.దీనా దీనిని తయారుచేసింది.

ఇలా ఉప్పునీళ్లతో నింపడమే (credit:dezeen.com)

ఇది సోలార్ ల్యాంప్ కంటే చాలా శక్తి వంతమయింది. ఎందుకంటే, ఇన్సంట్ గా వెలుతురునిస్తుంది.

ఒకసారి ‘ఇంధనం’తో నింపితే శక్తి విడుదలనేది తక్షణం జరుగుతుంది.అదే సోలార్ లాంతర్లలో సోలార్ ఎనర్జీ ఆల్టర్నేటివ్ ఎనర్జీగా మారాలి, దానితో బ్యాటరీలను చార్జ్ చేయాలి. మరీ ముఖ్యంగా ఎండ ఉన్నపుడే సోలార్ వ్యవస్థలు పనిచేస్తాయి. ఈ సమస్యను వాటర్ లైట్ పరిష్కరించిందని పైప్ రూయిజ్ పినేడ్ (Pipe Ruiz Pined) వుండర్ మాన్ థామ్సన్ కొలంబియాక్రియోటివ్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైప్ రూయిజ్ పినేడా తెలిపారు.

“Once filled with water, the energy delivery is immediate while solar lanterns need to transform solar energy to alternative energy to charge batteries and they only work if there is the sun: Pipe Ruiz Pined, Executive Creative Director, Wonderman  Thompson Columbia.

వాటర్ లైట్ ఐయానైజేష్ ప్రక్రియ ద్వారా 24 గంటలు పనిచేస్తుంది. సముద్రపు ఉప్పునీటిలో  ఉన్న ఎలెక్ట్రోలైట్స్ లాంపులో అమర్చిన మెగ్నిషియ్, కాపర్ ప్లేట్లతో  రసాయన చర్య పొంది విద్యుదుత్పత్తి చేస్తాయి.

నిజానికి ఇది చాలా పాత కాలపు పద్ధతే అయినా, ఈ రసాయన ప్రక్రియా చాలా కాలం సాగేందుకు  వీలుగా   ఇ.దీనా ఈ ల్యాంపును రూపొందించింది. అందుకే చాలా దూర  ప్రయాణాలలో కూడా దీనిని వాడవచ్చు.  ఈ సుదీర్ఘ కాలం జరిగ రసాయని ప్రక్రియను  ఇ.దీనా పేటెంటు కూడా చేసింది.

ల్యాంపు జీవితకాలంలో  5,600 గంటల విద్యుదుత్పత్తి చేస్తుంది. అంటే వాడకం తీవ్రతనుఒట్టి ఒక్క వాటర్ ల్యాంప్  రెండు మూడు సంవత్సరాలు వస్తుంది.

వాటర్ లైట్ కు సిలిండర్ వంటి బాడీ ఉంటుంది. దానికి చెక్కతో చేస్తారు.  ఐయోనైజేషన్ ప్రాసెస్ లో విడుదలయ్యే హైడ్రోజన్ వాయువు ను ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు  వీలుగా పైన రంద్రాల మూత వుంటుంది.

వాయూ (Wayúu)అనే ఒక తెగు ప్రజలకోసం ఈ వాటర్ ల్యాంప్ తయారుచేశారు.  ఈ తెగ ప్రజలు కొలంబియా గువజారీ ప్రాంతంలోని ఒక ఏడారిలో నివసిస్తు ఉంటుంది. అభివృద్ధి , పరిపాలన అనేవి ఇంకా చొరబడిన మారుమూల ప్రాంతం ఇది. ఈ ప్రాంతం చుట్టూర కరిబియన్ సముద్రం ఉంటుంది. అక్కడి  ప్రజల సాంస్కృతిక శైలి తోనే అందంగా ఈల్యాంపును రూపొందించారు. వాయు ప్రజల సాంప్రదాయిక చిత్రాలను, నగిషీలను ఈ ల్యాంపు సిలిండర్ మీద చెక్కి అందంగా తీర్చిదిద్దారు..

సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఈ లాంతర్లు చాలా అసవరమే.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *