(ఆలూరు రాఘవశర్మ)
వద్దామా, వద్దా అని
తొంగి చూస్తున్నాడు
కొండలకు ఆవల
చెట్ల మాటు నుంచి
ఉదయి స్తున్న సూర్యుడు
భయం భయంగా వస్తున్నాడు
కంటికి కనపడ ని
కరోనా ను తలుచుకొ ని
కిటకిట లాడుతున్న
ఆస్పత్రుల ను చూసి
ప్రాణ వాయువు అందని
నిర్భాగ్య జీవితాలను చూసి
అంబులెన్స్ సైరన్ లను చూసి
శవ యాత్ర లను చూసి
స్మశానా లలో ఎగి సి పడుతున్న
మంటలను చూసి
కళ్లకు మాస్క్ వేసుకుని
ఫి డే లు రాగా లు వినిపిస్తున్న పాలకులను చూసి
పాలి తుల నిస్సహాయత ను చూసి
అసలు వద్దా మా, వద్దా అని
సందేహి స్తున్నా డు
వెనక్కి వెళ్ళి పోదామనుకుంటు నట్టున్నా డు సూర్యుడు
(భూమన్ గారు ఈ ఉదయం తిరుమల లో తీసిన ఉదయిస్తున్న సూర్య బింబం ఫోటో చూశాక)