లాక్ డౌన్ సడలిస్తున్నట్లు ప్రకటించిన మొదటి ముఖ్యమంత్రి

లాక్ డౌన్ ఆంక్షలను సడిలించాలని నిర్ణయించినట్లు  ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్  ప్రకటించారు. అనేక రాష్ట్రాలు ఇంకా పెరుగుతున్న కేసులులతో దిగిరాని మరణాలతో, ఆక్సిజన్ కొరత తీర్చుకోలేక నానా తంటాల పడుతున్నపుడు ఢిల్లీ ప్రజలు కరోనా పోరాటంలో విజయం సాధించారని ఆయన ప్రకటించారు. మరొక ముఖ్యమంత్రి అయితే, ఇది తన విజయంగా చెప్పుకునే వాడు. పాలాభిషేకాలు , బ్యానర్లు, పోస్టర్లు, కేకేలు కట్ చేయడాలు ఉండేవి. సింప్లిసిటీ చీఫ్ మినిష్టర్ ఈ విజయం ప్రజలదే అన్నారు.

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గిపోతుండటంతో సోమవారం నుంచి ఢిల్లీ అన్ లాకింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.

దేశంలో మహారాష్ట్ర తర్వాత  ఎక్కవగా కోవిడ్ కేసులతో సతమతమయిన ప్రాంతం ఢిల్లీయే. ఆక్సిజన్ లేక అక్కడి ఆసుపత్రిలన్నీ ఆక్రందనలు చేశాయి.  సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే ఆక్సిజన్ లేక 25 మంది చనిపోయారు. ‘ మా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొన్నిగంటలకు మంచి రాదు, ఆక్సిజన్ ఇచ్చి ఆదుకోండి,’ఆ ఆసుపత్రి సూపరింటెండెంటు బహిరంగా ప్రపంచాన్ని వేడుకున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ఆక్సిజన్ కోసం కేంద్రం మీద కోర్టులో పోరాటం జరిపాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని కేంద్రం ఆక్సిజన్ విడుదల చేయించుకున్నాడు..  ముఖ్యమంత్రి  పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన కేంద్రంతో పోరాడుతూనే ఉన్నాడు. కోవిడ్ సంక్షోభం లో కూడా ఇదే కొనసాగింది.

ఢిల్లీలో లాక్ డౌన్ ఏప్రిల్ 19న మొదలయింది. రెండు మూడు సార్లు పొడిగించాల్సి వచ్చింది.  ఇపుడు మే 31 నుంచి ఆంక్షలను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు

సెకండ్ వేవ్ తర్వాత ప్రజలు ఆకలితో అలమటించకుండా తమ ప్రభుత్వం తక్షణం చర్యలు మొదలుపెడుతుందని ఆయన ప్రకటించారు.

“Currently there is no shortage of hospital beds, ICU, and Oxygen. So we have to start the un-lockdown process. We should ensure that we don’t land in a position in which people survive Covid-19 but die of poverty,”అని శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

అయితే, ఎప్పటిలాగనే ప్రజలు తమ జాగ్రత్తలు కొనసాగించాలని, ఎంతో అవసరమయితే తప్ప బయటకు రాకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని అనుకోదని, ఆయతే పరిస్థితి మళ్లీ ఖరాబయితే మళ్లీ లాక్ విధించాల్సిన అగత్యం వస్తుందని, అది రాకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని ఆయన కోరారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *