ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసుల పాజిటివిటీ రేటు బాగా తగ్గుకుంటూ ఉంది. ఇది సంతోషకరమయిన వార్త. చాలా రోజులుగా కేసులు పెరుగుతూ ఉండటం, మృతుల సంఖ్యలో కూడా ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్న ప్రజలకు ఇది మనసు తేలికపరిచే విషయం.
పాజిటివిటీ రేటు ఉంటే మొత్తం జరిపిన కోవిడ్ పరీక్షల లలో ఏ శాతం పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయన్నదే పాజిటివిటీ రేటు. పాజిటివ్ కేసులు తక్కువ కనబడితే కమ్యూనిటీలో కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉందని అర్థం.
రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం:
మే 17న పాజిటివిటీ రేటు 25.56 శాతం. అంటే పరీక్షలు చేయించుకునన వారిలో 25 శాతం మందికి కోవిడ్ సోకిందన్న మాట. ఇదే పాజివిటీ రేటు
మే 27 నాటికి 19.20 శాతానికి తగ్గింది.గత
10–12 రోజలుగా పాజిటివిటీ రేటు తగ్గుకుంటూ వస్తున్నది.
అలాగే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది.
మే 18న 2.11 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి.
మే 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయి.
ఇదే వరసలో రికవరీ రేటు అంటే కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగుపడుతోంది. మే 7న రికవరీ రేటు 84.3 శాతం.
మే 27న రికవరీ రేటు 87.99 శాతం.
గడచిన ఏడు వారాల డేటాను పరిశీలిస్తే తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కడప, కృష్ణా, విజయనగరం ఇలా అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుకుంటూ వస్తోంది