-రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు
-ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
-ఆన్ లైన్ లో కొనసాగుతున్న విదేశీ వైద్యుల సేవలు
-24/7 అందుబాటులో ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్
కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
ఆక్సిజన్ కోసం కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్రంలోని రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఏర్పాట్లు చేశారు.
హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చింది.
మరోవైపు కరోనా బాధితులకోసం విదేశీ వైద్యులతో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సేవలు ఇప్పటికేప్రారంభించింది.