తెలంగాణ రాష్ట్రంల మొట్ట మొదటి చిన్నపిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రం ప్రారంభమయింది.కోవిడ్ ధర్ద్ వేవ్ వస్తే అది పిల్లల మీదే ఎక్కువ ప్రమాదం చూపుతూ ఉందనే చర్చ దేశంలో జరుగుతూ ఉంది. ఆ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే హెచ్చరిక చేశారు.
3వ కోవిడ్ వేవ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం చిన్న పిల్లల కోవిడ్ కేర్ సెంటర్ ని ప్రారంభించింది. మంత్రి పువ్వాడ అజయ్ దీనిని ప్రారంభించారు.ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటయిన పిల్లల కోవిడ్ కేర్ సెంటర్ లో 40 బెడ్స్, 35 వెంటిలేటర్లతో అన్ని సేవలు లభిస్తాయి. జిల్లా కలెక్టర్ RV కర్ణన్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా 40బెడ్స్ తో వెంటిలేటర్, ICU, SICU లతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి అజయ్ అన్నారు.