ఎపుడూ జనంతో కిటకిట లాడే హైదరాబాద్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ వూహించి ఉండరు. పూర్వం ఎపుడో మతకల్లోలాలపుడో, రాజకీయ పార్టీలు బంద్ లకు పిలుపు ఇచ్చినపుడు కొన్ని ప్రాంతాలలో ఇలా హైదరాబాద్ బోసిపోయి కనిపించేంది. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ మళ్లీ తన దారి తాను పట్టేది. జనజీవనంతో నిండుగా కనిపించేది. కళకళలాడేది. సందడిగా ఉండేది. కాని కరోనా దెబ్బతో వారాల తరబడి, కాదు నెలల తరబడి హైదరాబాద్ ఇలా నిర్మానుష్యంగా మారిపోతున్నది. కళ తప్పుతూ ఉంది.
ఈ నిర్మానుష్య నిశబ్దం వెనక ఎంత ఆవేదన ఉందో, ఎన్ని జీవితాలు చితికిపోతున్నాయో, ఎంతనిస్సహాయత ఎన్నికుటుంబాలను వేదిస్తూ ఉందో, ఎంత విషాదం ఎన్ని ఇళ్ల తలుపు తడుతున్నదో లెక్కేలేదు.
మళ్లీ హైదరాబాద్ నగరం, తెలుగు వాళ్ల భాగ్య నగరం, తొందరగా తుళ్లిపడుతూ కేరింతలు కొడుతూ జీవనకాసారం కావాలని కోరుకుందాం.
లాక్ డౌన్ అవకాశంగా భావించి చార్ మీద దగ్గిర జిహెచ్ ఎంసి వాళ్లే వో మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు.