విలియం షేక్స్పియర్ చనిపోయాడు… RIP

వ్యాక్సిన్ అంటే భయం సర్వత్ర వ్యాపిస్తున్నది.వ్యాధి : ఇంతకు ముందు ఎపుడూ ఎక్కడ ఎవ్వరికి సోకని కొత్త కోవిడ్. దీనిని తీసుకువస్తున్నది కొత్త కరోనా వైరస్. చూస్తుండగానే వేలాది మందిని చంపేస్తున్న ఈ వైరస్ ను అంతమొందించాలి. లేక పోతే మావన జాతికే ముందున ప్రపంచంలోని  మందుల  కంపెనీ నావెల్ కరోనవైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు పరుగుదీస్తున్నాయి. మొత్తానికి  వ్యాక్సిన్ తయారయింది. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు దశబ్దాలు పడుతుంది, ఇపుడే ఆర్నెళ్లకే తయారుచేశారు, ఇలాంటిది తీసుకుంటే ప్రాణం ఉంటుందో, పుటుక్కున పోతుందో అనే చర్చు సాగుతూ ఉంది.   ఈ టీకా  తీసుకుని చావడం కంటే కోవిడ్ కొద్ది రోజులైన బతకవచ్చేమో అనుకోవడం జరగుతూ ఉంది.

ఎందుకంటే, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారయింది. క్లినికల్ ట్రయల్స్ జరగడం లేదని, జరపడం లేదని, జరిపినా తగినన్ని చేయడం లేదని, కేవలం వ్యాపార ధ్యేయంతో రాత్రిరాత్రి వ్యాక్సిన్ సృష్టించి ప్రపంచం మీదకు వదుల్తున్నానరనే వార్తలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు జంకుతున్న రోజులు.

మొదటి వ్యాక్సిన్ సూదికి ఎక్కించుకుని గత ఏడాది డిసెంబర్ ఫైజర్-బయోఎన్ టెక్ కంపెనీ ఎవరైనా ముందుకు రండి అని పిలుస్తా ఉంది. ఇంగ్లండులో తొలి వ్యాక్సిన్ ప్రయోగించేందుకు రంగం సిద్ధమయింది.

అపుడు ముందుకు వచ్చింది ఉడుకురక్తం పొంగుతున్న నవయువకులు కాదు, సైనికులు కాదు, డాక్టర్లు కాదు, శాస్త్రవేత్తలు కాదు. ఇద్దరు పండు ముసలి వాళ్లు. అందులో ఒకరు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ పేరున్న విలియమ్ షేక్స్పియర్ , వయసు 81 సంవత్సరాలు.

మరొకరు 91 యేళ్లున్న మార్గరెట్ కీనన్. షేక్స్పియర్ కంటే ముందు మార్గరెట్ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ టీకా వేయించుకున్న తొలి మహిళ అయ్యారు.

తర్వాత షేక్పియర్ టీకాతీసుకుని కోవిడ్ టీకా తీసుకున్న తొలిపురుషుడయ్యాడు. అయితే, దురదృష్ట వశాత్తు షేక్స్పియర్ మాత్రం నిన్న చనిపోయారు.

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడు విలియమ్  షేక్స్పియర్ (81) మృతిచెందారుని బ్రిటిష్ పత్రికలు రాశాయి. ఆయన వ్యాక్సిన్ లాగే, మరణ వార్త కూడా అంతర్జాతీయ వార్త అయింది. కారణం, ఆయన కరోనాతోసంబధంధంలేని మరొక జబ్బుతో చనిపోయారు.

ఆయన తొలి టీకా తీసుకోవడం కంటే, ఆయన పేరు బాగా అంతర్జాతీయ ఖ్యాతిపొందింది.  నేటి షేక్స్పి యర్ వ్యాక్సిన్ తీసుకోవడం మీద ఎంత హాస్యం కురిసిందో లెక్కలేదు. కార్టూన్లు కూడా వచ్చాయి. ఆయన రాసిన నాటకాల టైటిల్స్ తోనే వార్తలు రాసేశారు.

మన షేక్స్పి యర్ చాలా ప్రశాంతంగా వ్యాక్సిన్ తీసుకోవడంతో అందులో comedy of errors ఏవీ దొర్లకుండా కథముగిసిందన్నారు.  టీకాల గురించి బయట ప్రపంచంలో ప్రచారమవుతున్న భయం బూటకమే (Much ado about nothing)అని ఇంగ్లీష్ పత్రికలు రాశాయి.  షేక్సియర్ అంతటి వ్యక్తే వ్యాక్సిన్ తీసుకున్నపుడు (Winter of Discontent)పేచీ  ఏముంటుది? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇదొక  ground breaking,  It could make a difference to our live from now on  అని వ్యాఖ్యానించారు.

అంత పెద్ద వయసులో వీల్ చేయిర్ మీద ఉన్న వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చినందుకు బ్రిటన్ గర్విస్తుందని చాలా మంది ప్రశసించారు.

“It has been a tough year for so many people and there’s Willian Shakespeare putting it so simply for everybody- that we can now get on with our lives,” అని యుకె  హెల్త్ సెక్రెటరీ మ్యాట్ హ్యాన్కాకాక్ వ్యాఖ్యానించారు.

గ‌తేడాది డిసెంబర్ 8న మొట్టమొదటి  కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకుని అంతర్జాతీయ వార్త అయ్యారు.ఆయన రిటైర్డు ఉద్యోగి. పెన్షనర్.

యూనివర్సిటీ ఆస్ప‌త్రి కోవెంట్రీ అండ్‌ వార్విక్‌షైర్‌లో ఆయ‌న ఫైజర్ -బ‌యోఎన్‌టెక్‌ (Pfizer-BioNtech) సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్  తీసుకున్నారు. అంతకు ముందు మార్గరెట్ కీనన్ (91) అనే మహిళ ఇదే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇలా కోవిడ్ కు వ్యాక్సిన్ తీసుకున్న మొదటి మహిళ అయితే, షేక్స్పియర్ మొదటి పురుషుడయ్యారు. షేక్ప్పియర్ రోల్స్ రాయిస్ కంపెనీ లో పనిచశారు.ధార్మిక భావాలున్నవాడు. ఆయన లేబర్ పార్టీ కార్యకర్తకూడా.  ఆప్రాంతంల్ సాంఘిక సేవ చేస్తూ ఉండేవారు. ఇదే ఆసుపత్రిలో ఆయన చాలా కాలంగా ఇన్ –పేషంటుగా చికిత్స తీసుకుంటూవస్తున్నారు.ఆయనకు భార్య (జాయ్), ఇద్దరుకుమారుడు, మనవళ్లు ఉననారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న మృతిచెందినట్లు ఆయ‌న మిత్రుడు జైన్ ఇన్నేస్‌ వెల్ల‌డించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *