(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, తిరుపతి)
భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ మీరే “కన్నీరు” కారిస్తే 135 కోట్ల మంది “భారతదేశ ప్రజల కన్నీరు” ఎవరు తుడుస్తారు!
దేశ ప్రజలందరికీ కరోనా కష్టకాలంలో నేనున్నాను అన్న మనోధైర్యాన్ని నింపాల్సిన దేశ ప్రధానే కన్నీరు కార్చడం అంటే కరోనా కట్టడిలో చేతులెత్తేయడమే అని ప్రజలు భావించి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది!
పశ్చిమ బెంగాల్,తమిళనాడు,కేరళ లతో పాటు వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్షలాది మందితో “బహిరంగ సభలు” పెట్టారు “ర్యాలీలు” నిర్వహించారు ఆ రోజు దేశ ప్రజల ప్రాణాలు గుర్తుకు రాలేదా మోడీ జీ! ఎన్నికలు వాయిదా వేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు కదా!
“కుంభమేళా”లో లక్షలాది మంది సాధువులు ప్రజలు పాల్గొన్నారు ఆ రోజే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి కట్టడి చేసి ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగేదేనా ఓసారి ఆత్మవిమర్శ చేసుకోండి!
తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నిత్యం గోవింద నామస్మరణ వినపడేది అలాంటిది ప్రతి క్షణం కుయ్ కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ ల మోత మారు మ్రోగుతోంది!
కరోనా వైరస్ కారణంగా భర్తను కోల్పోయి భార్య,తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు,బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు హృదయ విదారకంగా మారుతున్నాయి!
కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుంది అన్న భరోసా కల్పించండి, మనోధైర్యాన్ని నింపండి, భారతదేశ ప్రజలు విజయం సాధించేలా స్ఫూర్తి నివ్వండి
వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేలా దేశ ప్రధానిగా ఆదేశించండి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చి ప్రజల కన్నీళ్లు తుడవండి!