ఈసారి తెలంగాణ ఆవిర్భావ సంబురాలు లేనట్లే…

ఈ సారి జూన్ 2 వ తేదీన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాలు జరపడం డౌటే నంటున్నారు. జరిగినా వర్చువల్ పతావావిష్కరణ జరగవచ్చని తెలిసింది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర చోట్ల మంత్రులు మంది మార్బలం లేకుండా పతాకావిష్కరణ మాత్రం చేయవచ్చని అనుకుంటున్నారు.

ఎందుకంటే రాష్ట్రంలో మరొక పక్షం రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఇపుడున్న లాక్ డౌన్ మే 29న ముగుస్తుంది. ఈ లోపు  లాక్ డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ అదే జరిగితే తెలంగాణ ఆవిర్భావం వెడుకలకు ఆస్కారం ఉండదు.

సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నందున సంబురాలతో వైరస్ కు ప్రోత్సాహం ఇవ్వరాదని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకు జూన్ 2 సంబురాల గురించి చర్చ జరగలేదని జిఎడి  అధికారి ఒకరు తెలిపారు.

ప్రధాని మోదీ కుంభమేళాకు పర్మిషన్ ఇచ్చి కూరుకుపోయారు.  పరిస్థితి ఎంతవరకువచ్చిందంటే ఆయన ఏకంగా ఏమీ చేయలేని దైన్యంలో కంట తడిపెట్టారు. కాబట్టి మరొక  రాష్ట్ర సంబురాల జోలికి వెళ్లకపోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *