నల్లగొండ లో డ్రోన్ లసాయంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని జిల్లా పోలీసులు నిర్ణయించారు. భారీగా కరోనా విస్తరిస్తున్నా కొందరు నియమాలు లెక్క చేయకుండా బయట తిరుగుతూ కరోనా విస్తరణకు తోడ్పడుతున్నారు. అందువల్ల లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించే వారి మీద నిఘా పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల గల్లీలలో కూడా లాక్ డౌన్ నియమాలు అమలవుతాయి. గల్లీలలో ఉన్నాం, ఎవరూ చూడటం లేదని లాక్ డౌన్ ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే అంతే సంగతులు . డ్రోన్ నిఘా పెట్టిన విషయాన్ని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
శనివారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో డ్రోన్ కెమెరాల ద్వారా లాక్ డౌన్ ను పరిశీలించారు.
నల్లగొండతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించడం ద్వారా లాక్ డౌన్ మరింత కఠినంగా ఆమలు చేసేలా చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.
గల్లీలలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి గల్లీలలో తిరిగినా ణం లేకుండా ఇంటి నుంచి బయటికి వచినా వెంటనే డ్రోన్ ద్వారా గుర్తించి తీసుకుంటామని ఆయన చెప్పారు
జిల్లాలో కరోనా నియమాలు కఠినంగా పాటించాలని ఆయన చెప్పారు.
నియమాలు:
ప్రభుత్వ ఉద్యోగులు ఐడి కార్డుతో పాటుగా విధిగా ఉదయం 10-00 గంటల లోగా కార్యాలయానికి చేరుకోవాలి.
సాయంత్రం 5-00 నుండి 6-00 గంటల సమయం వరకు ఇంటికి చేరుకోవాలి.
మీడియా ప్రతినిధులకు మినహాయింపు ఉంది. అయితే విధిగా వారి అక్రిడిటేషన్ కార్డులు, సంస్థ జారీ చేసిన ఐడి కార్డులు ఉండాలి.
విద్యుత్ శాఖ, అత్యవసర సేవల విభాగాలు, లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వబడిన శాఖల వారు వారి వాహనాలకు ముందు స్టిక్కర్ ఉండాలి. ఐడి కార్డులు వెంట ఉంచుకోవాలి,
కార్మికులు, ఉదయం 10.00 లోగా పనుల్లోకి వెళ్లి తిరిగి రాత్రి 9.00 కల్లా ఇండ్లకు చేరుకోవాలి.
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, వైద్య విభాగంలో పని చేసే ఉద్యోగులు వారి ఐడి కార్డులతో పాటు వాహనాలకు స్టిక్కరింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
మెడికల్ ఏజెన్సీల నుండి మెడికల్ షాపులకు ఔషధాల సరఫరా రాత్రి 7.00 నుండి ఉదయం 9.00 వరకు మాత్రమే అనుమతి.
ఇ-కామర్స్ స్విగ్గి, జోమాటో, రిలయన్స్, హెరిటేజ్ సిబ్బంది విధిగా వారి బ్రాండ్స్ తో కూడిన యూనిఫామ్, ఐడి కార్డు, వెహికిల్ స్టిక్కర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
గూడ్స్ వాహనాలకు రాత్రి 9.00 నుండి ఉదయం 8.00 వరకు మాత్రమే అనుమతి.