తెలంగాణ ‘టెన్త్ అంతా పాస్‘ లెక్కలివే…

2020-21 విద్యా సంవత్సరంలో  పరీక్షలు నిర్వహించడం సాధ్యం  కానందున అందరిని పాస్ చేసిన సంగతి తెలిసింది. వీరందరికి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయిస్తారని ముఖ్యమంత్రికెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు జివొ  విడుదల చేశారు. తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థుల వివరాలు:

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల కోసం  5 , 21 , 073 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారంతా  ఉత్తీర్ణలుయ్యారు. వీరిలో 5, 16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు.  4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు.  రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు.  2,53,661 మంది  బాలికలు ఉన్నారు.

ఈ విద్యార్థుల్లో  2,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ. సాధించారు.మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయని ఈ విషయాన్ని ఈ రొజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలు www.bse.telangana .gov .in మరియు http:// results.bsetelangana.org వెబ్ సైట్ లో మధ్యాహ్నం మూడు నుంచి అందుబాటులో ఉంటాయి.

విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *