1.అలెగ్జాండర్ గ్రిగోరి విచ్ లుక్ష్‌హెన్‌కో(బెలారస్),
2.జైర్ బల్స్‌నోరో(బ్రెజిల్)
3.నరేంద్రమోడీ(భారత్),
4.డోనాల్డ్ ట్రంప్(అమెరికా),
5.ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రెడార్(మెక్సికో)
అనువాదం రాఘవ శర్మ, ద వీక్ సౌజన్యంతో
కరోనా ఇప్పుడు అదుపుచేయడానికి వీలు కానంత తీవ్రంగా పరిణమించింది.
రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారిని అదుపు చేయాల్సిన జాబితాలో భాగమైపోయారు. కొన్ని దేశాల అధినేతలు, కొందరు మాజీ అధి నేతలు దీని తీవ్రతను పెద్దగా పట్టించుకోలేదు.
వీరు శాస్త్ర విజ్ఞానాన్ని(సైన్స్‌ను) అవమాన పరిచారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి ప్రాథమిక ఆరోగ్య నియమాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ప్రాణాలను బలిగొనడానికి దారితీసిన ఈ పరిణామాలలో ఈ నాయకులు కనీసం ఏదో ఒక ఆరోగ్య నియమాన్ని ఉల్లంఘించారు. వారిలో ఈ నియమాలన్నిటినీ ఉల్లంఘించిన మహానుభావులు కూడా ఉన్నారు.
నరేంద్రమోడీ (భారత ప్రధాని)
భారత దేశంలో 2021 మే నెలలో రోజుకు నాలుగు లక్షల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచమంతా వ్యాపించిన కరోనా మహమ్మారికి భారత దేశం కేంద్రంగా తయారైంది. ఈ లెక్కలు దీని తీవ్రతను పూర్తిగా చెప్పలేకపోతున్నాయి.
ఆస్పత్రిలో రోగులు మరణిస్తున్నారు.డాక్టర్లకు ఆక్సీజన్ అందుబాటులో లేదు.
రెమ్‌డెసివిర్ వంటి ప్రాణాలను కాపాడే మందులు అందుబాటులో లేవు.
ఆస్పత్రులలో బెడ్‌లు దొరకక కరోనా సోకిన రోగులు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు.
ఈ విషాదానికి ఒకే ఒక్క మనిషి కారణమని చాలా మంది భారతీయులు ఆరోపిస్తున్నారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ.కరోనాను సమర్థవంతంగా ఎదురుర్కోవడం ద్వారా మానవత్వాన్ని కాపాడాం అని 2021 జనవరిలో మోడీ ప్రకటించారు. ఈ మహమ్మారి ఆట కట్టించామని ఆరోగ్య శాఖా మంత్రి మార్చిలో ప్రకటించారు.
కానీ నిజానికి కరోనా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగా విస్తరించింది. కోవిడ్-19 సంక్షోభం మరింత వ్యాపించకుండా మోడీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు.
దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలోకూడా ఈ వైరస్‌ను పూర్తిగా రూపుమాపలేదు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో మోడీ, అతని పార్టీనాయకులు బహిరంగ ప్రదేశాల్లో కిక్కిరిసిన జనసమూహాల మధ్య ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు.వీరిలో కొందరు మాత్రమే మాస్క్ ధరించారు.
మోడీ అనుమతి తోనే జనవరి నుంచి మార్చి వరకు లక్షలాదిమంది భక్తులు పాల్గొన్న కుంభమేళా జరిగింది.
ఈ కుంభమేళా వల్లనే కరోనా బాగా వ్యాప్తి చెందిందని, ఇది అతి పెద్ద తప్పిదమని ప్రజారోగ్య శాఖ అధికారులు ఇప్పడు భావిస్తున్నారు.
భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రమని మోడీ గత ఏడాది ప్రచారం చేశారు.
పది మిలియన్ల వాక్సిన్ డోసులను పొరుగు దేశాలకు పంపారు.
మే నెల మొదటి నాటికి నూట ముప్పై కోట్ల మంది భారతీయులలో కేవలం 1.9 శాతం మందికి మాత్రమే వాక్సిన్ వేయగలిగారు.
జైర్ బోల్సనారో (బ్రెజిల్ అధ్యక్షుడు)
కోవిడ్-19ని ఎదుర్కోవడంలో బ్రెజిల్ అధ్యఢుడు జైర్ బోల్సనారో (Jair Bolsonaro) విఫలం మయ్యాడు. ఇదొక ఫ్లూ లాంటి చిన్న జ్వరం అని భావించాడు. బ్రెజల్‌లో ఈ సంక్షోభాన్ని మరింత దారుణంగా తయారు చేశాడు.
బోల్సనారో తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించుకుని ఆస్పత్రి మర్యాదలలోకి జొరబడ్డాడు.
ఆరోగ్య శాఖ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకున్నాడు.
వ్యాక్సిన్ సేకరణను, సమాచారాన్ని బహిర్గతం చేశాడు.
మతపరమైన సమావేశాలలో మాస్క్ తప్పని సరిగా ధరించాలనే చట్టాన్ని వ్యతిరేకించాడు.
కరోనా మహమ్మారి వల్ల శాశ్వతంగా నష్టపోయిన ఆరోగ్య సిబ్బందికి ఇచ్చే పరిహారం వంటి వాటిని రద్దు చేశాడు.భౌతిక దూరాన్ని పాటించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకున్నాడు.తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి నిత్యావసరాలని చెప్పి చాలా వ్యాపారాలను, చివరికి వ్యాయామ శాలలను కూడా తెరిపించాడు.కరోనా చికిత్సకు ఉపయోగపడతాయని నిర్ధారణ జరగని హైడ్రో క్లోరోక్విన్(హెచ్ సీ క్యూ) వంటి మంందులను కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేశాడు. బోల్సనారో దేశాధ్యక్షుడుగా తనకున్న అధికారాలతో శాస్త్ర విజ్ఞానాన్ని తప్పుగా ప్రదర్శించడం, సామాజిక దూరాన్ని, ఆర్థిక విపత్తు గురించి తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేయడం ద్వారా కరోనా వైరస్ సంక్షోభం గురించి అశాస్త్రీయమైన చర్చలు నిర్వహించాడు.
కరోనా సంక్షోభానికి చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు బ్రెజిల్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని ఆరోపించాడు.
తన దేశాన్ని ఈ విపత్తునుంచి ఎలా బైట పడేయాలన్న బాధ్యతను మాత్రం ఆయన స్వీకరించలేదు. వాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డిసెంబర్‌లోనే ప్రకటించి, తాను వాక్సిన్ కూడా వేయించుకోలేదు.
నీవు మొసలిలాగా తయారవుతానంటే అది నీ ఖర్మ అని వ్యఖ్యానించాడు.
కరోనాను ఎదుర్కోవడంలో బోల్సనారో అనుసరించిన తప్పడు విధానాలతో అతని మంత్రి మండలిలో కూడా విభేదాలు పొడచూపాయి.
సంవత్సరం లోపే నాలుగు సార్లు ఆరోగ్య శాఖామంత్రులను మార్చాడు.
బ్రెజిల్‌లో అదుపులేని మమహ్మారి, వి.ఐ. వేరియంట్ వంటి త్వరగా వ్యాపించే కొత్త రకాల వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేసింది.
చివరికి బ్రెజిల్లో కోవిడ్-19 వ్యాప్తి పెరగడం ప్రస్తుతం ఆగిపోయింది కానీ, ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
అలెగ్జాండర్ లుకషెన్కో(బెలారస్ దేశాధినేత)
కోవిడ్ -19 విషాదాన్ని ఎదుర్కోడానికి తగిన విధానాలు లేక అనేక దేశాధి నేతలు చాలా ఇబ్బందిపడ్డారు. కొందరు కరోనా కాలపు చెత్త నాయకులు సమర్ధవంతమైన చర్యలు చేపట్టకుండా పూర్తిగా అశ్రద్ధ చేశారు.
బెలారస్ దేశాధినేతగా చాలా కాలంగా పనిచేస్తున్న అలెగ్జాండర్ లుకషెన్కో(Alexander Lukashenko) కోవిడ్-19 మహమ్మారిని అసలు గుర్తించనే లేదు.
ఈ మహమ్మారి వ్యాపించిన కొత్తల్లో చాలా దేశాలలో లాక్ డౌన్ విధిస్తే, కరోనా నియంత్రణకు ఎలాంటి ఆంక్షలు వద్దని అలెగ్జాండర్ లుకషెన్కో నిర్ణయించాడు.
పైగా వోద్కా(మద్యం) సేవించినా, ఆవిరి స్నానం చేసినా, పొలాల్లోకి వెళ్ళినా కరోనా సోకదని నమ్మబలికాడు.
ముఖ్యంగా కరోనా సోకకుండా తీసుకునే చాలా ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలను వదిలేశాడు. మహమ్మారి బాధితులకు , సమూహాలకు ఆర్థిక సహాయం చేయడం మానేశాడు.లుకషెన్కో 2020 డిసెంబర్‌లో మాట్లాడుతూ, తనకు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని, తనకు కరోనా సోకిందని, ఈ వైరస్ పెద్ద ప్రమాదకరం కాదని చెప్పాడు. తానొక బలవంతుడినని చెప్పుకోడానికి మాస్క్ లేకుండా కోవిడ్ సెంటర్ ఆస్పత్రులను సందర్శించాడు.
బెలారస్ దేశంలో వాక్సిన్ వేయడం మొదలైనా, ఆ దేశాధినేత లుకషెన్కో మాత్రం వ్యాక్సిన్ వేసుకోలేదు.
ప్రస్తుతం మూడు శాతం బెలారుసియన్‌లు మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు.
డోనాల్డ్ ట్రంప్(అమెరికా మాజీ అధ్యక్షుడు)
డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం పదవీచ్యుతుడైనా, అతని తప్పుడు విధానాల వల్ల అమెరికా సమాజంపై కరోనా మహమ్మారి విధ్వంసకర పాత్ర దీర్ఘకాలం కొనాసాగుతోంది.
ఆ ప్రభావం ఆరోగ్యం పైన, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు జాతివివక్షతో కొనసాగుతోంది.
కరోనా మహమ్మారి ప్రభావాన్ని ట్రంప్ తొలుత అంగీకరించలేదు.
మాస్క్ వేసుకోవడం గురించి తీవ్రంగా తప్పుడు ప్రచారం చేశాడు.
అతని అసంబద్ద నాయకత్వం అమెరికా సమాజం మొత్తాన్ని నష్టపరిచింది; మఖ్యంగా కొన్ని జాతుల వారిని బాగా దెబ్బతీసింది.
అమెరికా జనాభాలో అమెరికన్ ఆఫ్రికన్లు, లాటినోస్‌లు 31 శాతం ఉన్నప్పటికీ, వారిలోనే 55 శాతం కరోనా కేసులు బైటపడ్డాయి,
అమెరికా పౌరులు కొందరు తమంత తాముగా ఆస్పత్రిలో చేరితే, దానికి మూడున్నర రెట్ల మంది బాధితులు బైట ఉన్నారు. రెండున్నర రెట్ల మంది తెల్లవారు మరణించారు.
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించాక పెరిగిన నిరుద్యోగ సమస్య కూడా జాతుల మధ్య సమంగా లేదు. నిరుద్యోగ సమస్య లాటినో అమెరికన్లలో 17.6 శాతం, ఆప్రికన్ అమెరికన్లలో 16.8 శాతం, ఆసియన్ అమెరికన్లలో 15 శాతం, తెల్లవారైన అమెరికన్లలో 12.4 శాతం మాత్రమే పెరిగింది.
పేదరికం, స్థిరమైన నివాసం లేకపోవడం, మంచి మైన విద్య అందకపోవడం వంటి వాటిలో జాతుల మధ్య మరింత తేడా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకున్నప్పటికీ, అల్పసంఖ్యాకుల అభివృద్ధి తెల్ల అమెరిన్లతో సమంగా లేదు.
కోవిడ్ -19 రావడానికి చైనా కారణమని ట్రంప్ ఆ దేశాన్ని నిందించాడు.
ఈ వైరస్ను కుంగ్ ఫ్లూ అని అనడం ద్వారా జాతి వివక్షతను కూడా ప్రదర్శించాడు.
ఆసియన్ అమెరికన్లపై , పసిఫిక్ ఐలాండర్లపై గతంలో చేసిన దాడిని రెండింతలు పెంచాడు. ఈ ట్రంప్ విధ్వంసకర వైఖరి విషమ పరిస్థితులను ఏమాత్రం తగ్గించలేకపోయింది.
ఇతర దేశాలు చేపట్టిన వాక్సిన్ అభివృద్ది తొలి దశలో ట్రంప్ పాలనా వ్యవస్థ సమర్థించింది. తప్పుడు సమాచారం, సైన్స్ వ్యతిరేక వాచాలత్వం కొనసాగించి, వారితో అమెరికా రాజీపడేలా చేసింది. తాజా సమాచారం ప్రకారం 24 శాతం మంది అమెరికన్లు, ముఖ్యంగా 41 శాతం మంది రిపబ్లికన్లు వ్యాక్సిన్ వేసుకోలేదని స్పష్టమైంది.
ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (మెక్సికో అధ్యక్షుడు)
మెక్సికోలో కరోనా వచ్చిన వారిలో 9.2 శాతం మంది మరణిస్తున్నారు.
ఈ మహమ్మారి వల్ల ప్రపంచలో ఎక్కువ మరణాలు మెక్సికోలోనే సంభవిస్తున్నాయి.
తాజా అంచనా ప్రకారం ఈ దేశంలో 6లక్షల 17 వేల మంది మరణించారు.
ఈ మరణాల సంఖ్య జనాభా ఎక్కువగా ఉన్న అమెరికా, భారత దేశ మరణాల సంఖ్యతో సమానంగా ఉంది.
మెక్సికోలో ఈ పరిస్థితి కొనసాగడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నప్పటికీ, తగిన నాయత్వం లేకపోవడం ఒక ప్రధానమైన కారణం.
ఈ పరిస్థితి తీవ్రతను మెక్సికో అధ్యక్షుడు ఆండర్స్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడార్ (Andrés Manuel López Obrador) తగ్గించాలనుకున్నాడు.
దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించడాన్నితొలుత అడ్డుకున్నప్పటికీ, దేశ వ్యాప్త ర్యాలీలను నిర్వహించిన్పటికీ చివరికి 2020 మార్చి 23న దేశ వ్యాప్త లాక్ డౌన్‌ను రెండు నెలలపాటు విధించాల్సి వచ్చింది.
దేశాధ్యక్షుడు తరచూ తాను మాస్క్ వేసుకునే వాడు కాదు.
కరోనా మహమ్మారి రాక ముందు ; 2018 నుంచి కూడా ఆండర్స్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడార్ విధానాలు చాలా కఠినంగా ఉండేవి.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి అతి తక్కువగా ఆర్థిక వనరులను సమకూర్చడం ద్వారా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైంది.
కరోనా మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులకు దారి తీసింది.
ఇంతలో శీతాకాలపు కరోనా రెండవ దశ మొదలైంది.
చివరికి మరొక లాక్ డౌన్ అనివార్యమైంది. డిసెంబర్ 2020లో మెక్సికో మరోసారి మూతపడింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా మాస్క్ వేసుకున్న వారే కనిపిస్తున్నారు.
మెక్సికో జనాభాలో 10 శాతం మందికి వాక్సిన్ వేశారు.
దాని పొరుగున ఉన్న గౌటెమెలాలో వాక్సిన్ ఒక్క శాతం మాత్రమే పూర్తయింది.
మెక్సికోలో పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలం పట్టేలా ఉంది.
(రచయితలు: సుమితా గంగూలి(ఇండియానా యూనివర్సిటీ), డొరోథి చిన్ (కాలిఫోర్పియా యూనివర్సిటీ, లాస్ ఎంజెల్స్) ఎలైజ్ మసార్డ్ ద ఫోన్‌సెకా, ఫుడాకోవ్ గెటులియో వర్‌గాస్, స్కాట్ ఎల్ గ్రీన్ (మిచిగాన్ యూనివర్సిటీ), ఎలిజబెత్ జె. కింగ్, స్కాట్ ల్. గ్రీన్ (మిచిగాన్ యూనివర్సిటీ), సాల్వడార్ వాజ్‌క్వెజ్ డెల్ మెర్‌కాడో, (సెంటర్ డీ ఇన్‌వెస్టిగేషన్ డొసెన్‌సియా ఎకనొమికాస్)
(దీని మూలవ్యాసం The World’s Five Worst Pandemic Leaders ఇక్కడ చూడవచ్చు)