ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి దిట్ట. ఆయన్ని మించనోళ్లు ప్రస్తుతం తెలంగాణలో లేరు. ఈ విషయంలో మిగతా పార్టీలో లీడర్లందరూ బలదూర్.
పాండెమిక్ మొదలయి ఏడాది దాటింది.వేలాది మంది చనిపోయారు.డాక్టర్లు నర్సులు, మునిపిల్ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు.ఈ క్రమంలో చాలా మంది చనిపోయారు. అయితే, ఈ సమయంలో ఫామ్ హౌసులో,ప్రగతి భవన్ లో తప్ప కెసిఆర్ ఎక్కడ కనిపించలేదు. అలా ఏదోఒక ఆసుపత్రికి వెళ్లి నాలుతు అనునయ వాక్యాలు చెప్పి ఉరడిద్దాం. రిలీఫ్ ఇద్దాం, మీకు తోడు నేనున్నాను అని పరామర్శించలేదు. దానికి తోడ అన్నీ కోతలు కోశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.కోవిడ్ వస్తే, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాసుపత్రులలో చికిత్సీ తీసుకుంటారని అసెంబ్లీ లో ప్రకటించారు. మోదీకంటే ముందే తెలంగాణలో పాజిటివ్ కేసులు ‘తగ్గించారు.’ ఈ క్రమంలో ఆయనకు కోవిడ్ సోకింది .దీనితో ఆయన ఐసోలేషన్ కు వెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో కాకుండా యశోదా లో చిక్సిత్స తీసుకున్నారు. నిజానికి కరోన హ్యాండిలింగ్ విషయంలో చాలా అపకీర్తి పాలయ్యారు. అత్యదిక కాలం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తిగా పేరొచ్చింది.
ఈపుడు రెండో వేవ్ చావులు చుట్టూరు కనబడుతున్నాయి. ఆక్సిజన్ లేదు,మందులు లేవు, బెడ్లు లేవు. ఇక జాప్యం చేస్తే లాభం లేదనుకున్నారు. వెంటనే గాంధీ ఆసుపత్రిలో వార్డు వార్డు తిరిగారు. రోగులను పేరుపేరును ప్రమేమీర పల్కరించారు. మందులు, భోజనం బాగున్నాయా అని అడిగారు. డాక్టర్లతో మాట్లాడారు. అభినందించారు. ఇంకేముంది తెలంగాణ మీడియాలో టాప్ న్యూస్ అయింది. కోవిడ్ లాక్ డౌన్ లేకుండా ఈ పాటికి వూరూర పాలాభిషేకాలు జరిగి ఉండేవి.
గాంధీ పర్యటన విజయవంతం కావడంతో ఆయన ఈరోజు వరంగల్ ఎంజీఎం దవాఖానకు చేరుకున్నారు.
నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి ఈ పర్యటనను సూపర్ హిట్ చేశారు. తనకు వైద్య చికిత్స బాగా అందుతున్నదని కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అరిచారు. ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే ఏం కావాలి. రేపో మాపో వెంటటాచారి భార్యకో బిడ్డలకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి రాష్ట్రాన్ని యావత్తు సర్ ప్రైజ్ చేవయచ్చు.
జనరల్ వార్డును సందర్శించి రోగులను కూడదా పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.