వ్యాక్సిన్ కట్టుకథల గుట్టు విప్పిన ప్రొఫెసర్

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)ముంబైకి చెందిన ప్రొఫెసర్ ఆర్ రామ్ కుమార్ భారతదేశంలో రోజు రోజుకు వ్యాక్సినేషన్ తగ్గిపోతున్నవిషయాన్ని బయటపెట్టారు. దేశంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయ్. వెంటనే కరోన వ్యాప్తి అర్టికట్టకపోతే  కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది.

ఈనేపథ్యంలో దేశంలో ప్రజలందరికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలి. రోజురోజుకు వ్యాక్సినేషన్ పెరగాలి. ఇలా పెంచే ఉద్దేశంతోనే ‘టీకా ఉత్సవ్’ జరుపుకుందాం అని ప్రధాని పిలుపు ఇచ్చారు. ప్రధాని ఇచ్చిన పిలుపులు ఈ మధ్య అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. టీకా ఉత్సవ్ కూడా ఇలాగే ఫెయిలయింది. టీకా ఉత్సవ్ జరిగేనాటికి  టీకాలే లేవు. తర్వాత 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోండి, మే 1 నుంచి  అన్నారు. అప్పటికి టీకాల కొరత కొండెక్కింది.

కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ జోరుగాసాగుతూ ఉందని ప్రతిరోజు వివరాలు అందిస్తూంది. నిజానికి చాలా రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందక రెండు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నారు. చాలా చోట్ల కోవ్యాగ్జిన్ లేదు, కోవి షీల్డ్ లేదని బోర్డులు పెడుతున్నారు.  కేంద్రం తగినంత వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న గ్యారంటీ లేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు విదేశాలనుంచి వ్యాక్సిన్ కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ప్రజలకు వ్యాక్సినేషన్ ఎలా సాగుతుందో తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రామ్ కుమార్ చాలా ఆసక్తి కరమయిన విషయాలను ట్వీట్ చేశారు.

ప్రొఫెసర్ రామ్ కుమార్ చెబుతున్న వివరాలప్రకారం ఏప్రిల్ కంటే మే నెలలో వ్యాక్సినేషన్ తగ్గిపోయింది. రోజు వారీ వ్యాక్సినేషన్ 4.8 మిలియన్ డోసుల నుంచి 2.3 మిలియన్ డోసులకు పడిపోయింది.కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాల్లోనే  దాక్కుని ఉన్న మర్మాన్ని ఆయన వెల్లడించారు.  ప్రతిరోజు ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత కనిపించకుండా చేసేందుకు అందమయిన అబద్దాలు అల్లుతూఉంది. దీనిని ఆయన  వెల్లడిచేశారు. కోవిడ్ లోలోపుల భయంకరంగా విస్తరిస్తున్నపుడు ఇలాంటి అందమయిన అబద్దాలు ప్రాణాంతకమమవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ లెక్కలు అబద్దం, సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ వ్యాక్సీన్ తయీరీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకుంటాయో చెబుతున్న లెక్కలు అబద్దం.ఇలా అబద్దాలు చెబుతూ పోతే, హాని ఎవరికి. సాధారణంగా వ్యాక్సినేషన్ 50 శాతం పూర్తయ్యాక స్పీడ్ తగ్గుతుంది. అమెరికా, చైనా వంటి దేశాలలో ఈ ట్రెండ్ కనిపిస్తుంది. కాని ఇండియాలో 10 శాతం వ్యాక్సినేషన్ అయ్యేటప్పటికే స్పీడ్ పడిపోయింది. కొరత పెరిగింది. కోవిడ్ సునామీ లాగా తుడిచిపెట్టేస్తూ పోతున్నది.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *