ఆంధ్రలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయ్ …

ఆంధ్రప్రదేశ్  లో గత 24 గంటల్లో (నిన్న 9AM నుంచి నేటి9AM దాకా) నమోదయిన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. మొన్న దాదాపు దాదాపు 24 వేల పైబడి కేసులు నమోదయితే గడచిన 24 గంటల్లో కేవలం  18,561 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిన్న జరిపిన కోవిడ్ టెస్టులు కూడా తగ్గిపోయాయి. నిన్న 73,749 శాం పిల్స్ ని మాత్రమే పరీక్షించారు.

మొన్న 94,550 శాంపిల్స్ ని పరీక్షించగా 24,171 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయింది. రికార్డయిన మరణాలు 101. ఆంధ్రలో కోవిడ్ కేసులు తగ్గేందుకు కారణమనా, నిజంగానే కరోనా అదుపులోకి వస్తున్నదా లేక టెస్టులు తగ్గిపోయి ఇలా కేసులు తక్కువగా కనిపిస్తున్నాయా అనేది మరికొన్ని రోజుల పరిశీలన తర్వాత తెలుస్తుందని అధికారి ఒకరు ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’ కు తెలిపారు.

జిల్లాల వారీగా మరణాలు

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో పదహారు మంది, అనంతపూర్ లో పది మం ది, చిత్తూర్ లో పది మంది, గుంటూరు లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నంలో తొమ్మిది, కృష్ణ లో ఎనిమిది, నెల్లూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, ప్రకాశం లో నలుగురు మ,వైఎస్ఆర్ కడప లో ముగ్గురు మరణిం చారు.
● గడచిన 24 గం టల్లో 17,334 మం ది కోవిడ్ నుం డి పూర్తిగా కోలుకుని
సంపూర్ణ ఆరోగ్య వం తులు అయ్యా రు
● నేటి వరకు రాష్ట్రం లో 1,80,49,054 సాం పిల్స్ ని పరీక్షించడం జరిగింది.

జిల్లాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *