కోవిడ్ బాధితులకు అత్యవసర చికిత్సకు వినియోగించే రెమ్డిసివిర్ ఇంజక్షన్ లను బ్లాక్ విక్రయించినా,కృత్రిమ కొరత సృష్టించినా గూండా యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు.
తమిళనాడు లో ఈ మధ్య కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో రెమ్డిసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండ్ పరిగింది. దీనితో బ్లాక్ మార్కెట్ లో ఈ ఇంజక్షన్ అత్యంత ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయిస్తున్న అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అరెస్టులు ఎక్కువ అవుతుండటంతో బాక్ల్ మార్కెటీర్ల మీద గుండాచట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు.
ఇదే విధంగా ఆక్సిిజన్ సిలిండర్లను కూడా అధిక ధరలను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులందుతూ ఉండటంతో వారి మీద గూండాయాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు.
‘పేద ప్రజలు తమ జీవనోపాధికి హాని జరుగుతున్నా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు సహకరిస్తున్నారు. ఇలాంటపుడు కొంతమంది సంఘ విద్రోహశక్తులు కోవిడ్ రోగులకు అత్యవసరం చికిత్సకు అవసరమయ్యే రెమ్డి సివిర్, ఆక్సిజన్ ను అక్రమనిల్వలు చేస్తున్నారు. బాక్ల్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. దీనిని సహించము,’ అని ఆయన చెప్పారు.