ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏది చేసినా ఇతరులకంటే ఒకడుగు ముందుంటాడు. ఈసారి ఢిల్లీ కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కోసం ఆసుపత్రుల చుట్టూర అంబులెన్స్ లలో పరిగెత్తకుండా ఉండేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. రాాజధాని ఢిల్లీ లో ఆక్సిజన్ కొరత ఉంటే, ఆయన కోర్టు కెక్కి కేంద్రాన్ని దారికి తెచ్చుకుని ఢిల్లీకి సమృద్దిగా ఆక్సిజన్ వచ్చేలా తెచ్చుకున్నారు. ఇపుడు ఆయన ఆక్సిజన్ అసవరమయినవారికి నేరుగా ఆక్సిజన్ ని ఇంటికెే అందించాలనుకుంటున్నారు.
కోవిడ్ బారిన పడిన ఆక్సిజన్ సమస్య ఎదుర్కొంటున్న రోగుల కోసం మద్రాసులో ఆక్సిజన్ పార్లర్లు ఏర్పాటుచేస్తుంటే, ఢిల్లీ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి ఆక్సిజన్ హోం డెలివరీ చేయాలనుకుంటున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యాక హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే రెండు గంటల్లో తమ బృందం ఆక్సిజన్ కాన్ సెంట్రటేర్లను అందిస్తుదని ముఖ్యమంత్రి తెలిపారు. తమ బృందంతో ఒక టెక్నిషియన్ కూడా ఇంటికి వచ్చి ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ల ఎలావాడాలో వివరిస్తారని కేజ్రీవాల్ చెప్పారు.
కోవిడ్ నుంచికోలుకొని వచ్చిన ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయిన వారికి కూడా ఆక్సిజన్ అవసరమయితే వారికి కూడా ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను అందిస్తామి, వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు.
कोरोना के खिलाफ लड़ाई को और मज़बूत बनाने के लिए हम दिल्ली में सबसे पहला Oxygen Concentrator Bank (OCB) शुरू करने जा रहे हैं | LIVE https://t.co/4IxPCgvHUQ
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 15, 2021
ఈ దశంలో ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఢిల్లీలోని కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమస్యరాకుండా ఉండేందుకు ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకు (OCB)లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ఒక్కో OCB లో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయి. ‘ కొవిడ్-19 సమస్య వల్ల కొంతమందిరి ఆక్సిజన్ సమస్య వచ్చి ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితిఎదురవుతున్నది. అది మరణానికి కూడా దారితీస్తున్నది.
ఇలాంటపుడు సహాయం కోసం 1031 నంబర్‌కు కాల్ చేయాలి,’ అని ఆయన చెప్పారు.
“ If someone has coronavirus but is not part of our home isolation group, they can call on 1031 and become a part of our home isolation group and demand oxygen concentrator. But, our team of doctors will first ensure that the patients need oxygen concentrators or not,”అని ఆయన చెప్పారు.
రోగులుకోలుకున్నాక ఈ ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్స్ ను వెనక్కి తీసుకుంటారు. వాటిని శానిటైజ్ చేసి ఇతర పేషంట్లకు అందివ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు.