చైనా ఆంగారకుడి మీద కాలు మోపింది. చైనా పంపిన రోవర్ ‘ఝు రాంగ్’ (Zhu Rong), చివరి ‘9 నిమిషాల టెర్రర్’ ని విజయవంతంగా అధిగమించి శనివారం ఉదయం అంగారక గ్రహం మీద వాలింది.
అంగారకుడి మీద దిగాలంటే చివరి తొమ్మది నిమిషాల దిగుడు యాత్ర చాలా జటిలమయింది. అందుకే ఈ 9 నిమిషాలకు నాసా Nine Minute Terror అని పిలించింది.
చైనా రోవర్ దీనిని ఆధిగమించింది. ఇది ఎలా దిగిందో చూసేందుకు ఆ సయంలో రోవర్ మీద చైనా కు కంట్రోల్ లేదు. ఇది దిగడం అనేది మానవ ప్రయత్నం లేకుండా సాగాలి. ఆంగారకుడి మీద ఉండే ప్రతికూల వాతావరణ కారణంగా ఈ 9 నిమిషాల టెర్రర్ ను అధిగమించడం చాలా కష్టం. అందుకే 50 శాతం ప్రయత్నాలే విజయవంతమయ్యాయి. శనివారం నాడు, ఝు రాంగ్ పంపిన ,టెలిమెట్రీ సిగ్నల్ ను బట్టి మే 15న తియాన్ వెన్ -1 ల్యాండర్ విజయవంతంగా నిర్దేశించిన ప్రదేశంలో నే దిగిందని చైనా స్పేస్ ఎడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రదేశం పేరు యుటోపియా ప్లెయిన్ (Utopia Plain). ఇది మార్స్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది.
ఇప్పటికే మార్స్ మీద అమెరికా రోవర్ తిరుగుతూ ఉంది. అమెరికా ఒక హెలికాప్టర్ ని కూడా మార్స్ మీద ఎగిరించింది. ఆంగారకుడి ని చేరుకునేందుకు అమెరికా చైనా ల మధ్య పోటీ నడుస్తూ ఉంది. ఇపుడు ఝు రాంగ్ దిగడంతో అమెరికాతో చైనా ధీటయిన శక్తి అనిపించుకుంది.
ఏడు నెలలు ప్రయాణించి, మూడు నెలల పాటు అంగారకుడి చుట్టూ తిరిగి చవరకు ఈ రోజున అంగారకుడి నేలమీద కాలుమోపింది. అంగారకుడి మీద కాలు మోపిన దేశాలలో చైనా మూడవది. ఇంతకు ఆమెరికా, సోవియట్ యూనియన్ లే విజయవంతమయ్యాయి.
ఝు రాంగ్ 90 రోజుల పాటు అంగారకుడి వాతావరణం, బోగోళిక పరిస్థితులను పరిశీలించి, నమూనాలను సేరరించిపంపిస్తుంది. ఇందులో విజయవంతమయితే, ఇలా పరిశోధన చేసిన రెండో దేశంగా చైనా కు గుర్తింపు వస్తుంది. మొదటి దేశం అమెరికా. 1971లో సోవియట్ యూనియన్ అంగారకుడిమీద మార్స్ 3 రోవర్ ని దించినా, అక్కడికి వెళ్లాక రోవర్ సంకేతాలు పంపడం ఆగిపోయింది.
అంగారకుడి నుంచి 320 మిలియన్ కిమీ దూరాన ఉన్న భూమికి సంకేతాలు రావాలంటే 20 నిమిషాలు పడుతుంది. అంగారకుడి మీద దిగే ప్రాసెస్ కు ఏడు నుంచి 9 నిమిషాలు పడుతుంది.ఇది బ్లాకౌట్ పిరియడ్. ఈ సమయంలో గ్రౌండ్ టీమ్ రోవర్ ను గైడ్ చేయలేదు. శాస్త్రవేత్తల సాయం లేకుండా రోవర్ దానంతకదే దిగాలి.
ఝూ రాంగ్ రాకతో అంగారకుడి మీద తిరుగుతున్న వాహనాలు మూడయ్యాయి. మొదటి రెండు 1. క్యూరియాసిటి, 2. పర్సివరెన్స్. వీటిని అమెరికా ప్రయోగించింది. ఇంతవరకు అంగారకుడి మీదకు అమెరికా 10 ప్రయాణాలు చేసింది.