తిరుపతి రుయాలో చనిపోయింది 11, కాదు 23 మంది: CPI నారాయణ

రుయా మృతుల వివరాలు వెల్లడించిన సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ

అయణంబాకం, నగరి మండలం: తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం అసత్యాలు వల్లె వేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పష్టం చేశారు.

ఆక్సిజన్ అందక కేవలం 11 మంది మాత్రమే మృతి చెందారు అని జిల్లా కలెక్టర్ ప్రకటన నిజాలను కప్పి పుచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు.

ఆ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందారు అని వారి పేర్లతో సహా  వివరాలు మీడియాకు వెల్లడించారు.  ప్రభుత్వం తమ తప్పును కప్పి పుచ్చు కోవడం కోసం బాధితుల మరణాలను తక్కువ చేసి చూపడాన్ని  నారాయణ తీవ్రంగా ఆక్షేపించారు.

మృతుల వివరాలు

1.కె బాలు, తిరుపతి
2. జయచంద్ర, తిరుపతి
3.పి యెస్ రామారావు, చంద్రగిరి
4.రమేష్ బాబు, చాన్నారెడీ కాలనీ తిరుపతి
5. జీ భువనేశ్వరి బాబు, చిత్తూరు.
6.కలందర్,కుక్కలదొడ్డి
7.కె రమణ ఆచారి, పీలేరు
8. ఎన్ ప్రభాకర్
9.ఎస్ మహేంద్ర
10.ఎస్ షాహిద్
11. గజేంద్ర బాబు, పుంగనూరు
12. పుష్పలత,కలికిరి
13. మహమ్మద్ బాషా, మదనపల్లి
14. వేణుగోపాల్, సదుం
15.గౌడ్ బాషా, పుంగనూరు
16.రాజమ్మ, మేధంవాల పల్లి
17. మాదన్మోహన్ రెడ్డి, కందురు
18. దేవేంద్ర రెడ్డి, ఎర్రవారి పాలెం
19. సుబ్రమణ్యం
20.బి సులోచన,కలకడ
21.తనుజ రాణి, రేణిగుంట
22. పజులాల్, దామలచేరువు
23.వెంకట సుబ్బయ్య, రాజంపేట.

ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉంటే ఎందుకు ప్రభుత్వం అబద్దాలు ఆడాలని నిలదీశారు. ఇంతమంది మృత్యువాత పడడం చాలా బాధాకరం అని, మృతి చెందిన వారి విషయంలో ను అబద్దాలు చెబుతున్న ప్రభుత్వానికి మృతుల పేర్ల రూపంలో తాను ఛాలెంజ్ విసురుతున్నాను అని పేర్కొన్నారు.

కరోనా కట్టడి, వైద్యం అందించడంలో పూర్తిగా తమ చేతకాని తనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయట పెట్టుకున్నారని మండి పడ్డారు.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తూ ఉంటే కనీసం ప్రాణవాయువును కూడా అందించలేని ప్రభుత్వాలను ఏమనాలని ఘాటుగా నిలదీశారు. పైగా ఆక్సిజన్ అందక ఎవరూ మృతి చెందలేదు అని ఆరోగ్య శాఖ పేర్కొనడాని తప్పు బట్టారు.

హిందూపురం, విశాఖ, తిరుపతి, అనంతపురం ఒంగోలులో ఆక్సిజన్ అందక మృత్యు వాత పడ్డ వారి విషయంలో ఏమని సమాధానం చెబుతారు అని నిలదీశారు. ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారు అని తాము నిరూపిస్తామని సవాలు విసిరారు.

రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ అందించమని కేంద్రంలోని మోడీ సర్కారును నిలదేయలేక రాష్ట్ర ప్రజల ప్రాణాలు బలిపెట్టడాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మోదీ బ్లాక్ మెయిల్ పద్దతిని తలచుకొని వణుకు పడుతోందా అని ప్రశ్నించారు. ఆక్సిజన్ విషయంలో తప్పు అంతా కేంద్రానిదే నని వ్యాఖ్యానించారు.

ఇక వ్యాక్సిన్ విషయంలో కేంద్ర చేతులు ఎత్తివేయడాని ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు అందరికి వ్యాక్సిన్ అందించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉండగా దాన్ని రాష్ట్రాలపై తోసి చేతులు దులుపుకోవడం ఏమిటని వ్యాఖ్యానించారు.

అన్ని రాష్ట్రాలకు మధ్య తగువులు పెట్టడానికి ఈ తరహా చర్యలకి పాల్పడ్డటు చెప్పారు. వ్యాక్సిన్ కొనలేని పేద రాష్ట్రాల సంగతి ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇస్తున్న బయోటెక్ కంపెనీ యజమాని కులం ఆధారంగా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలే కులం పేరుతో వ్యాక్సిన్ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేయడాన్ని తప్పు బట్టారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి చూడాలని, దప్పిక వేసినప్పుడు బావి తవ్వే పద్దతుల్ని పక్కన పెట్టి ఆక్సిజన్, ఔషధాలు, వెంటిలేట్ బెడ్ తదితర అత్యవసర విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *