-Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
…ఆ విధంగా దుర్యోధన సంహారంతో మహాభారత యుద్ధం అంతమవుతుంది అని విదురుడు ధృతరాష్ట్రునికి మహాభారతయుద్ధాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించాడు.. ఇంత భయంకర యుద్ధం ఇక రాదేమో అని ఆశ్చర్యంగా అన్నాడు.. ఇదేమి యుద్ధం, ఇవేమి వ్యూహాలు మహారాజా కలియుగంలో ఒక జన నాయకుడు కంటికి కనిపించని మహమ్మారితో బ్రహ్మాండమైన యుద్ధం చేస్తాడు., వ్యూహప్రతివ్యూహాలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి విజయం సాధిస్తాడు,, అని చెప్పసాగాడు.,.
ఒక కరోనా అనే వైరసు కంటికి కనిపించని శత్రువు ప్రజలపై దాడి చేస్తుంది.. దానినుంచి ప్రజలను కాపాడేందుకు జగన్మోహన వ్యూహం ఉపయోగిస్తాడు..
దానికి కావలసిన మందులు, ఆక్సిజను, పడకలు,వైద్యులు వీటన్నింటిని పకడ్బందిగా నడిపేకి చతుర్ముఖ వ్యూహం పన్నుతాడు,..
మొదట జట్టు…అధికారులంతా ఒక జట్టు… ఎలా ధనసమీకరణ చేయాలి, నిధులెలా సర్దుబాటు చేయాలి.. దేశవిదేశాల నుంచి డయాగ్నోసిస్ కిట్లు, మందులు ఎలా సమీకరించాల.. ఎలా అవసరమైన ఎక్విప్మెంటు కావాల సిలెండర్ లు కావాల, లిక్విడ్ ఆక్సిజన్ కావాల, ఎలా సమీకరించాల, మాస్కు లు, PPE కిట్లు,,
రెండవ జట్టు..జిల్లా అధికారుల జట్లు… కలెక్టరు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రంగంలో ఉంటది.. ఎన్ని ఆసుపత్రి లు, ఎన్ని బెడ్లు, ఎంత ఆక్సిజను కావాల, ఎలా సర్దాల, ఎలా రోగులను తరలించాల సర్దుబాటు చేయాల, ….
మూడవజట్టు కోవిడ్ కేరు సెంటరులు., పోలీసులు.. శానిటేషన్ వర్కర్లు..,ఎలా ప్రజలను క్రమశిక్షణ లో ఉంచాల.. అంటువ్యాధి ప్రబల కుండా శుభ్రత ఎలా మెరుగుపరచాల, క్వారంటైన్ సెంటరులెలా మెయింటైను చేయాల, అందరికీ మూడు పూటలా భోజనాలు మందులు, వైద్యం అందాల.. లాక్డౌన్ పెడతానే పోలీసులతో డేగకన్నులతో పహారా…
నాలుగవ జట్టు వైద్యశాలలు…వైద్యులను సమీకరించడం, నర్సులు, టెక్నీషియన్లు పెంచడం, అందరికీ సరిపడే మందులు, ఆక్సిజను సమీకరించడం, అందరి ప్రాణాలను కాపాడడం,
ఈ పోరాటంలో చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్ళే జగన్మోహనునికి తోడుగా,,వ్యాక్సిన్ వ్యూహకర్తలు, పక్క రాజ్యాల సహాయాలు, దేశ విదేశాల ఆయుధాలతో ముందుకునడుపుతుంటారు,…
కాని బ్లాక్ మార్కెటర్లు,ప్రతిపక్షాలు, విమర్శకులు, అసంతృప్తిని ఎగదోస్తూ పద్మవ్యూహం లో బంధించాలని ప్రయత్నిస్తుంటాయి…
కాని రోజు రోజు కొత్త కొత్త వ్యూహాలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ, అంతిమంగా జగన్మోహనుడు విజయం సాధిస్తాడు అని విదురుడు భవిష్యత్ దర్శనం చేసాడు.,,
ధృతరాష్టుడు, మంత్రివర్గం సంభ్రమాశ్చర్యలకు లోనవుతూ కంటికి కనిపించని శత్రువుతో యుద్దం..కనిపించే శత్రువులతో యుద్ధం, క్రమశిక్షణ లేని ప్రజలతో యుద్ధం, ఇంటి దొంగలతో యుద్ధం, మీడియాతో యుద్ధం… ఎంతో ఆసక్తిగా ఉన్న యుద్ధాన్ని చూడాలని కుతూహలం ఎక్కువగా ఉంది,, అంతిమ విజయం సిద్ధించాలని అందరూ ఆశిస్తున్నారు.
(source: Whatsapp)
(Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్)