భారత్ వైరస్ వేరియాంట్ తో జగమంతా ఆందోళన…WHO ప్రకటన

భారత్ లో చెలరేగుతున్న కరోనావైరస్ వేరియాంట్ (B.1.617) ని ప్రపంచానికంతా ఆందోళన కలిగించే వేరియాంట్ (variant of concern VOC) అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

వైరస్ పరిణామంలో శాస్త్రవేత్తలు మూడు దశలు గుర్తించారు. అవి:వేరియాంట్ ఆఫ్ ఇంటరెస్టు (Variant of interest),  వేరియాంట్ ఆఫ్ కన్సర్న్ (Variant of Concern), వేరియాంట్ ఆఫ్ హైకాన్సీక్వెన్స్ (Variant of High Consequence).

ఇపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాలో గత ఏడాది కనిపించిన ఈ వేరియాంట్  (B.1.617) ని వేరియాంట్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ గా వర్గీకరించింది. ఇంతవరకు ఇది వేరియాంట్ ఆఫ్ ఇంటరెస్టుగానే ఉండింది.

ఒక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండి, తీవ్రంగా జబ్బు తెచ్చి ఆసుప్రతి పాలు చేయడం, మరణాలు కారణమవుతున్నా, రోగనిరోధక శక్తిని కూడా తట్టుకుని నిలుస్తున్నా దానిని వేరియాంట్ ఆఫ్ కన్సర్న్ అని పిలుస్తారు.  అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివన్షెన్ (CDC) వేరియాంట్ ఆఫ్ కన్సర్న్ కు ఇచ్చిన నిర్వచనం ఇది.

A variant for which there is evidence of an increase in transmissibility, more severe disease (e.g.,  increased hospitalizations or deaths), significant reduction in neutralization by antibodies generated during previous infection or vaccination, reduced effectiveness of treatments or vaccines, or diagnostic detection failures.

“ We classify it as a variat of concernt at a global level,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడర్ మారియా వాన్ కెర్కోవ్ (Maria Van  Kerkhove) తెలిపారు.

ఈవేరియాంట్ ని భారత్ ల గత డిసెంబర్ లో  గుర్తించారు. దాని తొలిరూపంలో ఎపుడో 2020 అక్టోబర్ లోనే కనిపించింది. ఈ వేరియాంట్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. B.1.617 సంతతి B.1.617.2 అనేక దేశాల్లో కనిపిస్తూ ఉందని, దీనితో అక్కడ వైరల్ లోడ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఇది వ్యాక్సిన్ తీసుకువచ్చిన ఇమ్యూనిటీ ని కూడా  అధిగమిస్తుందా అనేది ఇపుడు తేలాల్సిన ప్రశ్న అని ఈ సంస్థ నిపుణులు చెబుతున్నారు.

B.1.617 వ్యాపించిన దేశాలు (credit: Wgullyn via wikipedia)

 

దీనివల్లే అనేక దేశాలు భారత్ తో విమాన సంబంధాలు తెంచేసుకున్నాయి. ఈ వేరియాంట్ గురించి, దానికి మూడు తరాల గురించి ఈ రోజు మరింత సమాచారాన్ని ప్రపంచఆరోగ్యసంస్థ విడుదల చేయనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *